Adani Effect: స్టాక్‌ను చుట్టుముట్టిన అదానీ సంక్షోభం

Adani Effect: స్టాక్‌ను చుట్టుముట్టిన అదానీ సంక్షోభం
అయినకాడికి వొదిలించుకుంటోన్న అదానీ గ్రూప్‌ షేర్లు

స్టాక్‌ మార్కెట్‌ను చుట్టుముట్టిన అదానీ సంక్షోభం ఇవాళ తీవ్ర రూపం దాల్చింది. అదానీ గ్రూప్‌ కంపెనీ బాండ్లను తీసుకునేందుకు అంతర్జాతీయ బ్యాంకులు నిరాకరించాయన్న వార్తతో అదానీ గ్రూప్‌ షేర్లను ఇన్వెస్టర్లు తెగనమ్మారు. అదానీ కంపెనీ బాండ్లను స్విట్జర్‌ల్యాండ్‌కు చెందిన క్రెడిట్‌ సూసె ఆమోదించడం లేదని బ్లూమ్‌బర్గ్‌ సంస్థ పేర్కొనడంతో స్టాక్‌ మార్కెట్‌లో భయానక వాతావరణం నెలకొంది. అదానీ గ్రూప్‌ షేర్లను ఇన్వెస్టర్లు అయినకాడికి వొదిలించుకుంటున్నారు. బడ్జెట్‌ ప్రసంగం వరకు ఆగిన విదేశీ ఇన్వెస్టర్లు కొన్ని నిమిషాల్లో భారీ అమ్మకాలకు పాల్పడ్డారు. మార్కెట్‌ ఎంత భయానక వాతావరణం నెలకొందంటే అదానీ షేర్లలో కొనుగోలుదారులు కరువయ్యారు. నిన్న 20 వేల కోట్ల రూపాయల ఆఫర్‌ను విజయవంతంగా ముగిసిన అదానీ గ్రూప్‌కు ఇవాళ షాక్‌ తగలడంతో ఇన్వెస్టర్లు షాక్‌ తిన్నారు. అదానీ గ్రూప్ ఫ్లాగ్‌ షిప్‌ కంపెనీ షేర్‌ ఇవాళ 25 శాతం క్షీణించి 2వేల 229 రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఈ ధర వద్ద కూడా ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story