Adani Effect: 2007నుంచే అదానీ అవకతవకలు మొదలయ్యాయి : వికిపీడియా

షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్‌బర్గ్ ఆరోపణలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌పై..తాజాగా వికిపీడియా సైతం ఆరోపణలు గుప్పించింది. సాక్ పప్పెట్స్‌ను ఉపయోగించి గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం..అదానీ గ్రూప్‌కు అనుకూలంగా వ్యాసాలు రాయించుకున్నారని ఆరోపించింది. దశాబ్దకాలం కిందటి నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొంది. ఇందుకోసం సాక్‌పప్పెట్స్‌గా తన సంస్థలోని ఉద్యోగులనే అదానీ గ్రూప్ వాడుకుందని పేర్కొంది.
అదానీ కుటుంబం, వ్యాపారాలపై తొమ్మిది వ్యాసాలు రాసిన లేదా సవరించిన 40 మందికి పైగా సాక్‌పప్పెట్స్ బ్లాక్ చేశామని పేర్కొంది. వీళ్లలో చాలా మంది వ్యాసాలను ఎడిట్ చేయడమే కాకుండా, నాన్- న్యూట్రల్ సమాచారాన్ని కూడా చేర్చారని వికిపీడియా తెలిపింది. అయితే సాక్‌పప్పెట్స్ అదనంగా చేర్చిన వివరాలను మాత్రం వికిపీడియా వెల్లడించలేదు.
ఈ వ్యవహారంపై అదానీ గ్రూపు అధికార ప్రతినిధి నుంచి స్పందన కోరగా.. ఎటువంటి సమాధానం రాలేదు. అదానీలపై ఆర్టికల్ రాయడం 2007 నుంచి ప్రారంభమైందని.. కానీ 2012 నాటికి ముగ్గురు ఎడిటర్లు దాతృత్వం విభాగంలో సమాచారాన్ని మార్పులు చేశారని వికిపీడియా స్పష్టం చేసింది. అయితే వీళ్లను ఆ తర్వాత సాక్‌పప్పెట్స్ లేదా అన్‌డిక్లేర్డ్ పెయిడ్ ఎడిటర్‌లుగా గుర్తించి బ్లాక్ చేశామని స్పష్టం చేసింది. అదానీ కుటుంబం, గ్రూపు సమాచారంపైనా ఇదే తరహా ఘటనలను జరిగాయని పేర్కొంది. వికిపీడియా నాణ్యతా నియంత్రణ నిబంధనలకు విరుద్ధంగా కూడా కొందరు ఆర్టికల్స్‌ను రాశారని పేర్కొంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com