Adani Group:పార్లమెంట్‌లో అదానీ గ్రూప్‌ అంశం

Adani Group:పార్లమెంట్‌లో అదానీ గ్రూప్‌ అంశం
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదికపై పార్లమెంట్లో చర్చించాలని పట్టుబడుతున్న విపక్షాలు

అదానీ గ్రూప్‌ అంశం దేశంలో సెగలు పుట్టిస్తుంది. నిన్న మొన్నటి దాక మార్కెట్లను కుదిపేసిన ఈ వ్యవహారం తాజాగా పార్లమెంట్‌ను తాకింది. అదానీ గ్రూప్‌లో అవకతవకలు జరిగాయని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదికపై పార్లమెంట్లో చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తాయి. నివేదికపై పార్లమెంట్ వేదికగా చర్చ జరగాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక బడ్జెట్ సమావేశాలు మరింత హీటెక్కనున్నాయి.

హిండెన్‌బర్గ్ నివేదికలో పలు కీలక విషయాలు వెల్లడించింది. పోర్టుల నుంచి ఎనర్జీ వరకు బహుళ వ్యాపార సంస్థలు కల్గిన అదానీ గ్రూప్ అత్యధిక స్థాయిలో రుణాలు తీసుకుందని ఆరోపించింది. అయితే పన్నులను తప్పించుకునేందుకు ఎన్నో సంస్థలను సృష్టించిందని తెలిపింది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ, ఆయన డొల్ల కంపెనీలతో అదానీ గ్రూప్ బిలియన్ డాలర్లు లావాదేవీలు జరుపుతోందని పేర్కొంది. అయితే ఇవి అనుమానాస్పదమైనవని నివేదికలో చెప్పింది. 413 పేజీల స్పందనలో ఎలాంటి జవాబు ఇవ్వలేదని వెల్లడించింది.

హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడిన తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్ ఇన్వెస్టర్లు భారీ నష్టాలను చవిచూశారు. అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్లు -20 శాతం క్షీణించాయి. ఇప్పటి వరకు అదానీ గ్రూప్ కంపెనీల విలువ 5 లక్షల కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది. దేశంలోని అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారు ఎల్‌ఐసి కూడా ప్రభావితం అయ్యింది.

Tags

Read MoreRead Less
Next Story