Adani vs Hindenburg: లేఖల యుద్ధం

Adani vs Hindenburg: లేఖల యుద్ధం
ప్రపంచ కుబేరుల్లో మూడవ స్థానంలో ఉన్న అదానీ ఏడవ స్థానానికి పరిమితమయ్యారు

హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రపంచ కుబేరుల్లో మూడవ స్థానంలో ఉన్న అదానీ ఏడవ స్థానానికి పరిమితమయ్యారు. రెండు రోజుల్లోనే అదానీ గ్రూప్ కంపెనీలకు చెందిన.. 20వేల కోట్ల ధనం ఆవిరి అయినట్లుగా తెలుస్తోంది. అదానీ కంపెనీ షేర్స్ లో అవకతవకలు జరుగుతున్నాయన్న రిపోర్ట్ ను అమెరికాకు చెందిన 'హిండెన్ బర్గ్' అనే కంపెనీ విడుదల చేసింది. దీంతో ఒక్కసారిగా అదానీ గ్రూప్ షేర్లు కుప్పకూలాయి. మార్కెట్ లో తప్పుడు లాభాలు సృష్టించి ప్రజల ధనాన్ని దోచుకోనే కంపెనీలను అడ్డుకుంటామని 'హిండెన్ బర్గ్' స్వయంగా ప్రకటించుకుంది. ఇందులో భాగంగా... అదానీ గ్రూప్ పై 83 ప్రశ్నలను సందించింది హిండెన్ బర్గ్. ఈ ప్రశ్నలకు సమాధానంగా 413పేజీల జవాబును అదానీ గ్రూప్ రిలీజ్ చేసింది.

'హిండెన్ బర్గ్' నివేదిక బోగస్ అని అదానీ గ్రూప్ పేర్కొంది. అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేషిందర్ సింగ్ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. హిండెన్ బర్గ్ తప్పుడు నివేదికను ప్రజల్లోకి తీసుకెళ్లిందని అన్నారు. ఇది కేవలం అదానీ గ్రూప్ పై జరిగిన దాడి కాదని, ఆర్థికంగా ఎదుగుతున్న భారతదేశంపై దాడిగా అభివర్ణించారు. 'హిండెన్ బర్గ్' లేవనెత్తిన 88 ప్రశ్నల్లో 65 ప్రశ్నలకు సమాధానాలు చెప్పామని జుగేందర్ సింగ్ తెలిపారు. మిగిలిన 23 ప్రశ్నల్లో, 18 పబ్లిక్ వాటాదారులు సంబంధించినవని అన్నారు. మిగిలిన 5 ప్రశ్నలు ఊహాజనితాలని అన్నారు.

413 పేజీలపై హిడెన్ బర్గ్ స్పందన
అదానీ గ్రూప్ రిలీజ్ చేసిన 413 పేజీల వివరణపై 'హిండెన్ బర్గ్' స్పందించింది. జాతీయవాదం పేరుతో మోసాన్ని నిజమని నమ్మించలేమని చెప్పింది. భారతదేశం శక్తివంతమైన ప్రజాస్వామ్యం కలిగిన దేశం, భవిష్యత్తులో అభివృద్ధి చెంది సూపర్ పవర్ గా ఎదుతుందని తమకు నమ్మకం ఉంది. అయితే దేశం చాటున అదానీ అవకతవకలకు పాల్పడుతున్నారని హిండెన్ బర్గ్ ఆరోపించింది.

ఎవరీ 'హిండెన్ బర్గ్'..
'హిండెన్ బర్గ్' అమెరికాలోని న్యూయార్క్ వేదికగా పనిచేస్తుంది. ప్రపంచంలో మల్టీ మిలియన్ కంపెనీలు చేస్తున్న అవకతవకలను బయట పెట్టే పనిని తమ సంస్థ చేస్తుందని ఆ కంపెనీ స్వయంగా చెప్పుకుంది. ఏ కంపెనీలో అయితే షేర్ల విలువను తప్పుగా చూపెట్టి అధికలాభాలను పొందాలని చూస్తారో, ఆ వివరాలను సేకరిస్తుంది. దాదాపు 6 నెలలకు పైగా సదరు కంపెనీ రహస్య పత్రాలపై స్టడీ చేసి రిపోర్ట్ ను విడుదల చేస్తుంది.


'హిండెన్ బర్గ్' ఆయా కంపెనీలపై షార్ట్ సెల్లింగ్ చేస్తుందని తెలుస్తొంది. అంటే ఏ కంపెనీ షేర్లు నష్టాల్లో వెళ్తాయి, అన్న సమాచారం ముందుగానే తెలుస్తాయో... ఆ కంపెనీ షేర్లను కొని లాభాలు రాగానే అమ్మడం అన్నమాట. దీంతో పాటు.. పడిపోయిన షేర్లను కొని, కొన్ని సంవత్సరాలకు అమ్ముకుంటుంది. దీంతో కొన్ని కోట్ల లాభాలను సంపాదిస్తుంది 'హిండెన్ బర్గ్'. ఈ సంస్థ ఇస్తున్న రిపోర్ట్ ఆదారంగా పలు కంపెనీ షేర్లు పడిపోతాయని తెలిసినప్పుడు అదే కంపెనీ షేర్లను షాట్ సెల్లింగ్ చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో వేల కోట్లను హిండెన్ బర్గ్ సంపాదిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అదానీ గ్రూప్ కు 'హిండెన్ బర్గ్' కు మద్య లేఖలతో యుద్దం జరుగుతుంది. హిండెన్ బర్గ్ నివేధికతో వేల కోట్లు ఆవిరి అయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story