Adhaani: అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ

Adhaani: అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో  విచారణ
ఇన్వెస్టర్లకు రక్షణ కల్పించేలా సూచనలిచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు సొలిసిటర్ జనరల్

హిండెన్‌బర్గ్‌ నివేదిక-అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. భవిష్యత్తులో ఇన్వెస్టర్లకు రక్షణ కల్పించేలా సూచనలిచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. కమిటీలో సభ్యులను సూచించాలని సుప్రీంను కోరారు. హిండెన్‌ బర్గ్ నివేదిక నేపథ్యంలో ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సెబీ సమర్థంగా ఉందని వాదనలు వినిపించారు. కేంద్రం వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Tags

Next Story