అఫ్గాన్‌లో మహిళల పరిస్థితేంటి.. తాలిబన్ పాలనలో బానిసలుగా..

అఫ్గాన్‌లో మహిళల పరిస్థితేంటి.. తాలిబన్ పాలనలో బానిసలుగా..
Afghanistan: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు శరవేగంగా ఆక్రమించుకున్నారు. అమెరికా, నాటో దళాలను వెళ్లిన ఆరు నెలల్లోనే ఆఫ్గన్‎ను వారు హస్తగతం చేసుకున్నారు.

Afghanistan: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు శరవేగంగా ఆక్రమించుకున్నారు. అమెరికా, నాటో దళాలను వెళ్లిన ఆరు నెలల్లోనే ఆఫ్గన్‎ను వారు హస్తగతం చేసుకున్నారు. మరోవైపు అక్కడ తాలిబన్ల తాలిబన్ల పాలన ప్రారంభమైంది. అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలు దేశాన్ని విడిచివెళ్లిపోయేందుకు జనం ఉరుకులు, పరుగులు, తోపులాటలతో ఎటుచూసినా గందరగోళ పరిస్థితులే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఆ దేశంలో ఉంటున్న మహిళల పరిస్థితేంటి? అనే ప్రశ్నలకు తాలిబన్ల నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదు. ఇప్పటి వరకు మహిళల పట్ల తాలిబన్లు ఎలాంటి విధాన నిర్ణయాలు ప్రకటించలేదు.

రెండు దశాబ్దాల క్రితం తాలిబన్లు స్త్రీలను ఎలా చూశారో అందరికీ తెలుసు. స్త్రీలకు విద్య నిషేధించడం, బురఖా తప్పనిసరి చేయడం ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అంతేకాదు మహిళల హక్కులను కాలరాయడం, లైంగికబానిసలుగా మార్చడం తలుచుకొని మహిళాలోకం ఒక్కసారిగా ఉల్కిపడింది.

ముఖ్యంగా తాలిబన్ల ఆగడాల గుంరించి ఈ రెండు దశాబ్ధాల కాలంలో జన్మించిన యువతులకు అవగాహన లేదు. అయితే తానిబన్లు ప్రస్తుతం తాము మారిపోయామని, మహిళా విద్యను కొనసాగిస్తామని తాలిబన్లు ప్రకటించుకుంటున్నారు. అయినప్పటీకీ తానిబన్లను అక్కడి మహిళలు నమ్మడం లేదు. వారిలో ఇంకా భయం, ఆందోళన నెలకొన్నాయి. కానీ, గత నెల జూలైలో బందక్షాన్, తఖార్‌ ప్రావిన్సులను ఆక్రమించుకున్న తాలిబన్లు.. ఆ ప్రాంతాల్లో మహిళల జాబితా కావాలని స్థానిక నాయకులను ఆదేశించారు. ముఖ్యంగా 15ఏళ్లు దాటిన వారి వివరాలు, అలాగే 45 ఏళ్లలోపు వితంతువుల జాబితాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనలు తలుచుకొని మహిళల్లో ఆందోళన ఎక్కువైంది.

తాలిబన్‌ సైన్యంలో వారిని పెళ్లి చేసుకోవడానికి వితంతువులు, బాలికలు అవసరమని అదేశాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ ప్రాంతంలో మహిళల పరిస్థితి ఎంటనేది స్పష్టత లేదు. ఈ ఆదేశాలకు భయపడి చాలా ప్రాంతాల్లో ప్రజలు పారిపోయారు. అయితే కేవలం మూడు నెలల్లో దాదాపు 9 లక్షలమంది స్వస్థలాలను విడిచిపోయారంటే తాలిబన్‌ టెర్రర్‌ అర్థమవుతుంది. పేరుకు పెళ్లిళ్లు కానీ, ఇవన్నీ యువకులను మహిళలను పంపించి తమలోకి ఆకర్షించేందుకు తాలిబన్లు చేసే ప్రయత్నమే. ఇలా పెళ్లైనవారు భార్య హోదా పొందకపోగా లైంగిక బానిసలుగా మార్చడం వారు చేసే పని అని అందరికి తెలిసిందే. ఇదే తరహాను కొనసాగిస్తే 20ఏళ్లపాటు అఫ్గాన్‌ మహిళాలోకం సాధించిన విజయాలన్నీ మట్టికొట్టుకుపోతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తానిబన్లు ఆఫ్గానిస్థాన్ కైవసం చేసుకోవడంతో.. వారిపై అంతర్జాతీయ చట్టాలను గౌరవించేలా చర్యలు తీసుకోవాలని, మహిళల రక్షణకు, వారి విద్యాకు ఎలాంటి నియంత్రణ విధించకుండా చూడాలని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story