జాతీయం

ఈ నెల 26న విపక్షాలతో కేంద్రం సమావేశం.. కారణం ఇదే..!

All Party Meeting: ఈనెల 26న అఖిలపక్ష సమావేశం జరగనుంది..

ఈ నెల 26న విపక్షాలతో  కేంద్రం సమావేశం.. కారణం ఇదే..!
X

ఆఫ్గనిస్థాన్‌ పరిణామాలపై ఈనెల 26న అఖిలపక్ష సమావేశం జరగనుంది.. ఈ సమావేశంలో ఆఫ్గాన్‌ పరిణామాలను అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లకు వివరించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు.. దీనిపై విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ను ఆదేశించారు ప్రధాని. ఈనెల 26న ఉదయం పదకొండు గంటలకు పార్లమెంట్‌ హౌస్‌ ప్రధాన కమిటీ కార్యాలయంలో అఖిలపక్ష భేటీ జరగనుంది.. ఆఫ్గన్‌ పరిణామాలు, భారతీయుల తరలింపు సహా ప్రభుత్వ చర్యలను రాజకీయ పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలకు విదేశాంగ మంత్రి, అధికారులు వివరించనున్నారు.

Next Story

RELATED STORIES