కోవిడ్ పాజిటివ్ వచ్చిందని మెసేజ్ రావడంతో..

కోవిడ్ పాజిటివ్ వచ్చిందని మెసేజ్ రావడంతో..
కోవిడ్ టెస్ట్ చేయించుకున్న ఓ మహిళ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతోంది.

కోవిడ్ టెస్ట్ చేయించుకున్న ఓ మహిళ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతోంది. కారు టర్నింగ్ తీసుకునే సమయంలో రిపోర్ట్ పాజిటివ్ అని ఫోన్‌కి మెసేజ్ వచ్చింది. దీంతో షాక్ అయిన మహిళ తన కారుపై నియంత్రణ కోల్పోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. కేరళలోని కొల్లం జిల్లాలోని కదక్కల్‌లో సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది.

రిపోర్ట్ పాజిటివ్ అని రావడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌లు కూడా సిద్ధపడకపోవడంతో గాయపడిన మహిళ గంటకు పైగా రోడ్డుపైనే ఉండాల్సి వచ్చింది. అందులో కారు కూడా బోల్తా పడింది.

కొల్లం ఓంచల్ ప్రాంతంలోని 40 ఏళ్ల మహిళ ఒక ప్రైవేట్ ల్యాబ్‌లో కోవిడ్ టెస్ట్ చేయించుకుని తిరిగి వస్తోంది. తన ఫలితం తెలుసుకున్న మహిళ భయపడి చివరికి వాహనంపై నియంత్రణ కోల్పోయానని తెలిపింది. అదృష్టవశాత్తు కారు కరెంట్ స్థంభానికి ఢీకొట్టి బోల్తా పడినా ఆమెకు ఏమీ కాలేదు. ముఖానికి స్వల్ప గాయాలయ్యాయి.

ఆమె ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది, కారు పూర్తిగా పగిలిపోయింది. ఆమెతో పాటు తన ఇద్దరు పిల్లలు లేకపోవడం మరో అదృష్టం. ఆమె తన ఇద్దరు పిల్లలు 11, 8 సం.లు ఉన్నవారిని బంధువుల ఇంట్లో వదిలివేసింది.

అనంతరం అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పిపిఇ కిట్‌ను మహిళకు అందజేశారు. అయితే, కోవిడ్ రోగిని రవాణా చేయడానికి ఫైర్ అంబులెన్స్‌ను ఉపయోగించడానికి తమకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. తరువాత, అన్ని ప్రయత్నాలు ఫలించకపోవడంతో, ఆ మహిళ యొక్క బంధువు అక్కడికి చేరుకుని కారులో ఇంటికి తీసుకువెళ్ళాడు.

Tags

Read MoreRead Less
Next Story