మతమార్పిడులకు పాల్పడితే 10 ఏళ్ళు జైలుకే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త చట్టం

Dharma Swatantrya Bill: బలవంతపు మతమార్పిడులను అరికట్టే లక్ష్యంతో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలోని కేబినేట్ లవ్ జిహాద్ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. మధ్యప్రదేశ్ మతస్వేచ్ఛ బిల్లు 2020 పేరుతో రూపొందించిన ఈ చట్టానికి ఆమోద ముద్ర వేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఎస్సీ, ఎస్టీ సామజిక వర్గాలకు సంబంధించిన యువతులను బలవంతంగా మతమార్పిడి చేయించి వివాహం చేసుకుంటే పదేళ్ళ జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించే విధంగా బిల్లును ఆమోదించామని ఆ రాష్ట్ర హోం శాఖా మంత్రి నరోత్తం మిశ్రా వెల్లడించారు.
ఇక చట్టబద్దంగా మతమార్పిడి చేసుకుంటే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, 50 వేల వరకు జరిమానా ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ యువతి, యువకులు ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకోవాలంటే మతమార్పడి కోసం రెండు నెలల ముందే జిల్లా మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని అయన స్పష్టం చేశారు. అలాకాకుండా చేసుకునే వివాహం చట్టబద్దం కాదని, అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాగా మతమార్పిడి వివాహాలను నిషేధిస్తూ యోగి అధిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరవాత మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించిన రెండో రాష్ట్రంగా నిలించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com