Agra: పోకిరీలకు ఎదురు చెప్పినందుకు మహిళను బట్టలూడదీసి, చితకబాది....

Agra: పోకిరీలకు ఎదురు చెప్పినందుకు మహిళను బట్టలూడదీసి, చితకబాది....
X
పోకిరీలను వారించినందుకు ఆగ్రాలో మహిళపై అఘాయిత్యం; పగబట్టి మరీ ప్రతీకార దాడి...

పోకిరీలను వారించినందుకు ఓ మహిళపై 11మంది వ్యక్తులు ప్రతీకార దాడి చేసిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. గతవారం తనని ఇబ్బంది పట్టేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను సదరు మహిళ (30) వారించేందుకు ప్రయత్నించింది. ఆ ఘటన మనసులో పెట్టుకున్న యువకులు మరో తొమ్మిది మందిని తీసుకువచ్చి యువతి ఇంటిపై దాడి చేశారు. ఆమెను వివస్త్రను చేసి చితకబాదారు. అడ్డువచ్చిన కుటుంబ సభ్యులపైనా కూడా దాడి చేశారు. ఈ మేరకు తాజ్ గంజ్ పోలీస్టేషన్ లో యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని వారు బెదిరించినట్లు సదరు యువతి ఎఫ్.ఐ.ఆర్. లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం గాలిస్తున్నారు.

Tags

Next Story