జోరుగా ప్రచారం... బట్టలు ఉతికేశాడు.. గిన్నెలు తోమేశాడు.. !

తమిళనాడు రాష్ట్రానికి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.. ఈ ఎన్నికలను అన్నీ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని పార్టీలు, అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకర్షించేందుకు విభిన్నమైన రీతిలో ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే నాగపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఏఐఏడిఎంకె అభ్యర్థి తంగా కతిరావన్ బహిరంగంగా బట్టలు ఉతికి వార్తల్లో నిలిచారు.
బట్టలు ఉతకడమే కాదు.. పనిలో పనిగా పక్కనే ఉన్న గిన్నెలను కూడా తోమేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే తన నియోజక వర్గంలో ప్రతిఇంటికి వాషింగ్ మెషీన్‌ను ఇస‍్తుందని హామీ ఇచ్చారు. పార్టీలో చురుకైన నేతగా తంగా కతిరావన్ కి మంచి పేరుంది.
కాగా ఇంటింటికి వాషింగ్ మెషీన్లు, సోలార్ స్టవ్‌లు, కేబుల్ టీవీ కనెక్షన్లను ఫ్రీగా ఇస్తామని ఇటీవల విడుదల చేసిన తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఏఐఏడిఎంకె పేర్కొన్న సంగతి తెలిసిందే.. !
Tamil Nadu: AIADMK candidate Thanga Kathiravan from Nagapattinam washed people's clothes and promised to give washing machine after winning elections during campaigning yesterday. pic.twitter.com/gvSgUy6UT6
— ANI (@ANI) March 23, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com