కరోనా ట్రీట్‌మెంట్‌లో AIIMS కీలక ప్రయోగాలు

కరోనా మహమ్మారిని జయించే చికిత్సలో, వ్యాధి నిరోధక శక్తి పెంచే ప్రయోగాల్లో కీలక అడుగు ముందుకు పడింది. CCMB అటల్ ఇంకుబేషన్ సెంటర్‌లో క్లోన్‌డీల్స్-CCMB సంయుక్తంగా చేస్తున్న ప్రయోగాలు సత్ఫలితాలిచ్చాయి. కార్డిసెప్స్, కర్కమిన్ కాంబినేషన్‌లో కోవిడ్-19కి ఓరల్ సప్లిమెంట్ తయారీ జరిగింది. ఔషధ మష్రూమ్స్ అలాగే పసుపు గుణాలు కలిసిన కార్డిసెప్స్, కర్కమిన్ కాంబినేషన్‌తో ఔషధాన్ని తయారు చేశారు. అటు, కార్డిసెప్స్ క్యాప్సులిన్‌పై ఇప్పటికే ఎయిమ్స్‌లో క్లినికల్ ట్రయల్ జరుగుతున్నాయి. ఈ డ్రగ్ నూతన సంవత్సర కానుకగా అది మార్కెట్‌లోకి వస్తుంది. AIIMS నాగ్‌పూర్, AIIMS భోపాల్, AIIMS నవీ ముంబైలలో ఇప్పటికే దీనిపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏంబ్రోసియా, క్లోన్‌డీల్స్ కలిసి ఎయిమ్స్‌లో తొలిదశ క్లినికల్ ట్రయల్స్ చేపట్టారు. ఇక, యాంటీవైరల్, ఇమ్యూనిటీ బూస్టర్ సప్లిమెంట్ విషయంలో క్లోన్‌డీల్స్ విజయవంతంగా ముందడుగు వేసింది. ఈనెల 22న ఈ సప్లిమెంట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్టు క్లోన్‌డీల్స్ COO అతీక్ పటేల్ తెలిపారు.
కరోనా రోగుల్లో యాంటీ వైరస్ ప్రాపర్టీస్ పెంచడంలో కార్డిసెప్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఈ డ్రగ్ కరోనా రోగులకు చికిత్సలో కీలకంగా మారనుంది. క్లినికల్, బేసిక్ సైన్స్, సంప్రదాయ పరిశోధనల రూపంలో ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. కొవిడ్-19ను ఎదుర్కోవడంలో ఇవి సమర్ధంగా పనిచేస్తాయని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కార్డిసెప్స్ డ్రగ్‌తోపాటు CCMB నుంచి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా సిద్ధమవుతోంది. కార్డిసెప్స్ మిలిటారీస్ అనే అరుదైన మష్రూమ్ ద్వారా ఈ ప్రొడక్ట్‌ను రూపొందించారు.
అత్యంత సహజసిద్ధమైన ఆహార ఉత్పత్తి ద్వారా కొవిడ్ లాంటి మహమ్మారిని సమర్ధంగా ఎదుర్కోవడంలో.. అద్భుత ఫలితాలు సాధిస్తున్నట్టు ఆ సంస్థలు ధృవీకరించాయి. ప్రస్తుతానికి ఫుడ్ ప్రొడక్ట్ కేటగిరిలో అందుబాటులో వస్తున్న ఇమ్యూనిటీ బూస్టర్, యాంటీవైరల్‌పై.. ఈనెల 22న CCMB అధికారికంగా ప్రకటన చేయనున్నారు. యాంటీవైరల్‌గా, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరిచేలా, యాంటీ ఆక్సిడెంట్‌గా.. శక్తి పెంచే సప్లిమెంట్‌లా ఇమ్యూనిటీ బూస్టర్ మార్కెట్‌లోకి రానుంది. యాంటీవైరల్ కరోనా చికిత్సలో కార్డిసెప్స్ కీలకమైతే, ముందే రోగనిరోధక శక్తి పెంచే ఇమ్యూనిటీ బూస్టర్ మెరుగైన ఫలితాలి ఇస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com