Air India : రెండోసారి జరిమానా...

Air India : రెండోసారి జరిమానా...
తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటనలో రూ.30 లక్షలు, లావేటరీలో ధూమపానం చేసిన ఘటనపై రూ.10 లక్షల జరిమానా....

'ఎయిర్ ఇండియా'కు 10 లక్షల జరిమానా విధించింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA). డిసెంబర్ 2022లో ప్యారిస్ నుంచి న్యూఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. ఈ విమానంలో ఓ ప్రయాణికుడి వింత చేష్టలు చేశాడు. ఇందుకుగాను 'ఎయిర్ ఇండియా'కు జరిమానా విధించింది DGCA. జనవరి 24న రూ.10 లక్షల జరిమానా విధించింది. వాచ్ డాడ్ ఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకోవడం వారంలోపు ఇది రెండోసారి.

డిసెంబర్ 6, 2022న ప్యారిస్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన విమానంలో ఓ ప్రయాణికుడు లావేటరీలో నిలబడి ధూమపానం చేశాడు. సిబ్బంది వారించగా వారి మాటలను వినిపించుకోలేదు. మరోక ప్రయాణికుడు తన పక్క సీటులోని ఓ ప్రయాణికురాలు లావేటరీకి వెళ్లినప్పుడు ఖాళీగా ఉన్న సీటులో పడుకుని, ఆమె దుప్పటికప్పుకున్నాడు. దీంతో ఆవిడ ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనలపై DGCA సీరియస్ అయింది. జరిగిన విషయాలను DGCAకి ఎందుకు రిపోర్ట్ చేయలేదని ఎయిర్ ఇండియాను ప్రశ్నించింది, అంతర్గత కమిటీకి రిఫర్ చేయనందుకు విమానయాన సంస్థపై రూ.10లక్షల జరిమానా విధించింది. ఈ ఘటనలకు సంబంధించి చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఎయిర్ ఇండియా మేనేజర్ కు జనవరి మొదటివారంలో DGCA షోకాజ్ నోటీసులు జారీచేసింది. జనవరి 23న ఎయిర్ ఇండిన తన ప్రత్యుత్తరాన్ని DGCAకి సమర్పించగా, జరిమానా నిర్ణయాన్ని తీసుకుంది.

మరో ఘటనలోనూ జరిమానా..
జనవరి 20న ఎయిర్ ఇండియాపై రూ.30లక్షల జరిమానాను విధించిన విషయం తెలిసిందే. న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ విమానంలో ఓ వ్యక్తి తన తోటి ప్రయాణీకురాలిపై మూత్రవిసర్జన చేశాడు. ఈ విషయంపై సీరియస్ అయిన DGCA పైలెట్ ఇన్ కమాండ్ లైసెన్స్ ను సస్పెండ్ చేసింది. ఇన్ ఫ్లైట్ సర్వీసెస్ డైరెక్టర్ పై రూ.3 లక్షల జరిమానా విధించింది. నవంబర్ 26, 2022న ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం నిందితుడు జైల్లో ఉన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story