Air India : విమానంలో లిక్కర్ ఒక్కసారికి మించి ఇవ్వొద్దు

Air India : విమానంలో లిక్కర్ ఒక్కసారికి మించి ఇవ్వొద్దు
ప్రయాణికులకు మద్యం సరఫరా ఒక్కసారే; సిబ్బందికి ఎయిర్ ఇండియా సూచన

ఎయిర్ ఇండియాపై వరుస జరిమానాలు విధించడంతో, నివారణ చర్యలకు పూనుకున్నారు అధికారులు. ప్రయాణికులకు ఒక్కసారి మాత్రమే మద్యాన్ని అందించాలని సిబ్బందికి సూచించింది ఎయిర్ ఇండియా. ప్రయాణికులు చేసిన వికృతచేష్టలకు గాను ఎయిర్ ఇండియాపై (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) DGCA రెండు సార్లు జరిమానా విధించింది.

జనవరి 19న జారీచేసిన రివైజ్డ్ పాలసీ ప్రకారం, క్యాబిన్ సిబ్బంది అందిస్తే తప్ప, ప్రయాణికులు మద్యం తాగడానికి అనుమతించకూడదని అధికారులు స్పష్టం చేశారు. సొంతంగా మద్యం సేవించే ప్రయాణికులను గుర్తించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. "విమాన ప్రయాణంలో ఆల్కహాల్ సేవించడం సురక్షితమైన పద్ధతిలో జరగాలని, అందుకు ఒకేసారి మద్యాన్ని అందించాలని రెండోసారి కోరితే సున్నితంగా తిరస్కరించాలి" అని ఎయిర్ ఇండియా తెలిపింది. విమాన పాలసీ ప్రకారం ప్రయాణికులను తాగుబొతుగా గుర్తించవద్దని, వారు సృతిమించి ప్రవర్తిస్తే సున్నితంగా కంట్రోల్ చేయాలని సిబ్బందిని కోరింది.

Air India : విమానంలో లిక్కర్ ఒక్కసారికి మించి ఇవ్వొద్దుగత నెలలో రెండు సంఘటనలు జరిగాయి. ఒక వ్యక్తి తన తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేయగా, మరో ఘటనలో... ఓ ప్రయాణికుడు లావేటరీలో నిలబడి ధూమపానం చేశాడు. సిబ్బంది వారించినా వినిపించుకోలేదు. మరోక ప్రయాణికుడు తన పక్క సీటులోని ఓ ప్రయాణికురాలు లావేటరీకి వెళ్లినప్పుడు ఖాళీగా ఉన్న సీటులో పడుకుని, ఆమె దుప్పటి కప్పుకున్నాడు. దీంతో ఆవిడ ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలనన్నింటిపై DGCAసీరియస్ గా స్పందించింది. జనవరి20న జరిగిన ఘటనలో ఎయిర్ ఇండియాపై రూ.30లక్షల జరిమానాను విధించగా, పైలెట్ ఇన్ కమాండ్ లైసెన్స్ ను సస్పెండ్ చేసింది. ఇన్ ఫ్లైట్ సర్వీసెస్ డైరెక్టర్ పై రూ.3 లక్షల జరిమానా విధించింది. డిసెంబర్ 2022 ఘటనలో 'ఎయిర్ ఇండియా'కు 10 లక్షల జరిమానా విధించింది. దీంతో నివారణ చర్యలకు పూనుకుంది ఎయిర్ ఇండియా.

Tags

Read MoreRead Less
Next Story