Air India Row: సిబ్బందిని కొట్టిన ప్రయాణీకులు; వెనక్కి తిరిగి వచ్చేసిన ఫ్లైట్

ఢిల్లీ నుంచి లండన్ లోని హీత్రూ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కాసేపటికే అనుకోని కారణాల వల్ల తిరిగి మళ్లీ ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ఓ ప్రయాణీకుడు క్యాబిన్ క్రూతో గొడవ పడినట్లు తెలుస్తోంది. ఈ వివాదం ముదరడంతో సదురు ప్రయాణీకుడు ఏకంగా ఇద్దరు సిబ్బందిపై చేయిచేసుకున్నాడని ఎయిర్ ఇండియా ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది. దీంతో ఫ్లైట్ గమ్యస్థానం చేరుకోక ముందే తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుందని తెలిపారు. ఇతర ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్లైట్ ను మళ్లీ రీ షెడ్యూల్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలో ల్యాండ్ అవ్వగానే సదరు ప్రయాణీకుడిని పోలీసులకు అప్పగించినట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. ఈ మేరకు ఎఫ్ ఐఆర్ ను కూడా నమోదు చేసినట్లు తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com