Air India Urination Row: రూ. 30లక్షల జరిమానా...!

ఒకరి పాపం ఇంకోకరికి చుట్టుకోవడం అంటే ఇదేనేమో. గతేడాది నవంబర్ లో న్యూయార్క్ - న్యూఢిల్లీ విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి ఓ వృద్ద మహిళపై మూత్రవిసర్జన చేశాడు. ఈ ఘటన ఎయిర్ ఇండియా విమానంలో జరిగింది. విధులు సరిగ్గా నిర్వహించలేదన్న కారణంగా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ ( డీజీసీఏ) ఎయిర్ ఇండియాకు 30లక్షల జరిమానాను విధించింది. ఏవియేషన్ రెగ్యులేటర్ ఫ్లైట్, పైలట్ ఇన్ కమాండ్ లైసెన్స్ ను మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఆఫ్ ఇన్ - ఫ్లైట్ సర్వీస్ కు రూ.3 లక్షల జరిమానా విధించింది. విమానయాన సంస్థ, అధికారులు బాధ్యతలను సరిగ్గా నిర్వహించలేదని స్పష్టం చేసింది.
నవంబర్ 26 2022న శంకర్ మిశ్రా న్యూయార్క్ - న్యూఢిల్లీకి ప్రయాణిస్తున్నాడు. బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తున్న ఆయన పక్కనే ఉన్న వృద్ద మహిళపై మూత్రవిసర్జన చేశాడు. ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. మహిళ ఫిర్యాదు మేరకు మిశ్రాపై సెక్షన్ 294 (బహిరంగ ప్రదేశంలో అసభ్యకరమైన చర్య) , 354 ( మహిళను కించపరిచే ఉద్దేశంతో దాడి), 509, 510 ( తాగిన వ్యక్తి దుష్ర్పవర్తన) తో పాటు ఎయిర్ క్రాఫ్ట్ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు.
చాలాకాలం తప్పించుకు తిరిగిన మిశ్రాను జనవరి 7 2023న బెంగళూరులో పట్టుకున్నారు పోలీసులు. మొదటగా తాను మహిళకు నష్టపరిహారం చెల్లించానని తెలిపాడు. ఆతరువాత సదరు మహిళ ముత్రవిసర్జన చేసుకుందని మిశ్రా తరపు న్యాయవాది వాదించాడు. వృద్దురాలు కథక్ నృత్యకారిణి అని, వారికి మూత్రవిసర్జనలో సమస్య రావడం సహజమేనని కోర్టుకు తెలిపారు. విచారణ చేపట్టిన ధర్మాసనం మిశ్రాను నిందితుడిగా గుర్తించింది. ప్రస్తుతం శంకర్ మిశ్రా జైలులో ఉన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com