అజయ్ జడేజా అయితేనేం అయిదు వేలు కట్టాల్సిందే.. అలా ఎలా రోడ్డు మీదే..

ఉత్తర గోవాలోని సుందరమైన ఆల్డోనా గ్రామంలో బంగ్లాను కలిగి ఉన్న భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజాకు పొరుగు గ్రామమైన నాచినోలాలో చెత్తను వేసినందుకుగాను రూ .5 వేల జరిమానా విధించినట్లు గ్రామానికి చెందిన సర్పంచ్, తృప్తీ బందోద్కర్ సోమవారం తెలిపారు.
90 వ దశకంలో ఉన్న ప్రముఖ క్రికెటర్ ఎటువంటి రచ్చ చేయకుండా జరిమానా చెల్లించాడని బందోద్కర్ అన్నారు. "మా గ్రామంలో చెత్త సమస్యతో మేము బాధపడుతున్నాము. బయటి నుండి కూడా చెత్తను తెచ్చి మా గ్రామంలో పోస్తారు. అందువల్ల మేము కొంతమంది యువకులను నియమించాము. ఎవరెవరు చెత్త వేస్తున్నారో గమనించి మాకు తెలియజేయమన్నాము.
"మేము కొన్ని బస్తాల చెత్తను అక్కడి నుంచి తీసే ప్రక్రియలో అజయ్ జడేజా పేరిట ఒక బిల్లు ఉండడాన్ని చూశాము. దాంతో ఈ విషయాన్ని అతడి దృష్టికి తీసుకెళ్లాము. సెలబ్రెటీలు అయి ఉండి మీరే ఇలా చేస్తే ఎలా సార్. మిమ్మల్ని చూసి మిగతా వాళ్లు నేర్చుకునేలా ఉండాలి కాని. మీరే ఇలా చెత్తను రోడ్డు మీద వేస్తారా అని భవిష్యత్తులో గ్రామంలో చెత్తను వేయవద్దని మేము అతనికి తెలియజేసినప్పుడు, సారీ చెబుతూ జడేజా జరిమానా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. రూ.5000 జరిమానా చెల్లించాడు.
మేము చాలా గర్విస్తుంటాము సెలబ్రెటీ, ప్రముఖ క్రికెట్ ఆటగాడు మా గ్రామంలో ఉన్నందుకు అని ఆయన అన్నారు. కానీ ఇలాంటి వారు చెత్తకు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి "అని బందోద్కర్ అన్నారు. అల్డోనా గ్రామంలో జడేజా, రచయిత అమిత్ ఘోష్ తదితర ప్రముఖులు ఉన్నారు.
Also Read:
♦ అనుష్క గర్భం దాల్చినప్పుడు వేసుకున్న దుస్తులు ఆన్‌లైన్‌లో అమ్మకం.. వచ్చిన డబ్బుని..
♦ ఇమ్మానుయేల్ కి వేరే అమ్మాయితో పెళ్లి .. లైవ్‌లో కంటతడి పెట్టుకున్న వర్ష..!
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com