Meet The Matkaman: 73 ఏళ్ల క్యాన్సర్ సర్వైవర్.. ప్రతిరోజు 250 మందికి ఉచితంగా భోజనం..

Meet The Matkaman: 73 ఏళ్ల క్యాన్సర్ సర్వైవర్.. ప్రతిరోజు 250 మందికి ఉచితంగా భోజనం..
Meet The Matkaman: కావలసినంత డబ్బుంది.. కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నా అడిగే వాళ్లు లేరు.. కానీ అందులో ఆనందం ఉంటుందని అనుకోలేదు..

Meet The Matkaman: కావలసినంత డబ్బుంది.. కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నా అడిగే వాళ్లు లేరు.. కానీ అందులో ఆనందం ఉంటుందని అనుకోలేదు.. కళ్లూ, కాళ్లు పనిచేస్తున్నంత కాలం నలుగురికీ సేవ చేయాలనుకున్నారు. అందులోనే ఆనందం ఉంటుందని భావించారు ఢిల్లీకి చెందిన అలాగ్ నటరాజన్. లండన్‌లో 30 ఏళ్ళకు పైగా ఉండి, పదేళ్ల క్రితం భారతదేశానికి తిరిగి వచ్చారు.

73 ఏళ్ల నటరాజన్ క్యాన్సర్ సర్వైవర్ కూడా. ప్రతి వ్యక్తికి తాగడానికి అవసరమయ్యే స్వచ్ఛమైన నీటిని అందించాలనే లక్ష్యంతో ముందు పని చేశారు. తరువాత తన సేవలను విస్తరిస్తూ ఇప్పుడు ఢిల్లీ వాసులకు శుచి, శుభ్రతతో కూడిన, ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తున్నారు. ఇందుకు అతడి భార్య సహకారం కూడా ఎంతో ఉంది.

దక్షిణ ఢిల్లీలోని సంపన్న కుటుంబాలు నివసించే పంచశీల్ పార్క్ ప్రాంతంలో నటరాజన్ తన పని ప్రారంభిస్తారు. 'మత్కమాన్' అని పిలువబడే అలగ్ నటరాజన్ విదేశాలలో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన తర్వాత, స్వదేశంలో ఉన్న పేదల బాధలు అతడి మనస్సాక్షిని కదిలించాయి.

"నాకు డబ్బు అవసరం లేదు, విలాసవంతమైన కార్లు కొనడానికి నా దగ్గర తగినంత డబ్బు ఉంది. డబ్బు కంటే ఏది విలువైంది అని ఆలోచించినప్పుడు ఇతరులకు సహాయం చేయడం మంచిది అని అనిపించింది అంటారు.

మొదట్లో మరణించిన వారి అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాని వారి మృతదేహాలను దహనం చేయడంలో సహాయం చేశారు. తర్వాత రెండు వ్యాన్‌లలో స్వచ్ఛమైన నీటిని అందించారు. ఆ తరువాత వారానికి రెండు సార్లు ఆహారం అందించే ప్రక్రియను ప్రారంభించారు. దానికి మంచి ఆదరణ లభించడంతో ప్రతి రోజూ చేయాలనుకున్నారు. ఇప్పుడు దాదాపు రోజుకి 250 మందికి ఆహారం అందిస్తున్నారు.

తాను చేస్తున్న పని గురించి నటరాజన్ ఇలా అంటారు.. మీరు ఏది చేసినా బాగా చేయండి. నేను అందించే ఆహారం నాణ్యమైనదిగా ఉండాలి. "ఇక్కడం భోజనం చేసే వ్యక్తులు నా అతిథులు, నేను వారికి మంచి ఆహారం అందించలేకపోతే, నేను వారికి ఎందుకు వడ్డిస్తున్నాను? నేను నా అతిథులకు వడ్డించినట్లే వారికి వడ్డిస్తాను" అని అలగ్ నటరాజన్ చెప్పారు.

అవసరమైన వారికి ఆహారం అందించడమే కాకుండా వారు తృప్తికగా ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినేందుకు కుర్చీలు కూడా తీసుకు వచ్చి వేస్తారు. నటరాజన్ సేవలో భార్య కూడా పాలుపంచుకుంటుంది. ఆమె మాట్లాడుతూ..

"ఇంతకుముందు మేము లండన్‌లో ఒక హై కల్చర్ సొసైటీలో నివసించాము. నా భర్తకు ఇంతకు ముందు పోర్షే ఉంది. ఇప్పుడు అతని వద్ద 120 సిసి స్కూటర్ ఉంది. అతను తన కోసం ఏమీ ఖర్చు పెట్టకూడదనుకుంటున్నాడు, డబ్బు ఖర్చు చేయాలనే అతని భావన మారిపోయింది. నేను దాని గురించి చాలా సంతోషంగా ఉన్నాను. కానీ అతని పని మరియు ఆర్థిక విషయాలను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉండాలి కాబట్టి నేను దానిని నిర్వహిస్తున్నాను' అని సీతా నటరాజన్ చెప్పారు.

ఈ ప్రాంతంలోని కార్మికులందరికీ మట్కామాన్ స్టాండ్ వద్ద నీరు ఉంటుందని తెలుసు. బస్సు డ్రైవర్లు, ట్రక్కు డ్రైవర్లు మరియు ఇతర ప్రయాణికులు ఇక్కడకు వచ్చి నీళ్లు తాగుతారు. మట్కామాన్ తయారు చేసిన భోజనం 5 స్టార్ హోటల్ భోజనానికి ఏ మాత్రం తీసిపోదు. అంత రుచికరంగా అన్ని వంటకాలతో కూడి ఉంటుంది. "మధ్యాహ్న భోజనంలో జ్యూస్, ఫ్రూట్స్, లస్సీ , రకరకాల ఆహారాన్ని అందజేస్తాడు అని ఆటో రిక్షా డ్రైవర్ ధరమ్‌వీర్ నటరాజన్ గురించి చెప్పారు.

"ఈరోజు అతను రాజ్మా , ఆలూ , మామిడి, పుచ్చకాయ, కుల్చా , సలాడ్ అందించాడు. ఇది 5-నక్షత్రాల హోటల్ లో భోజనం చేసిన అనుభవాన్ని అందిస్తుంది అని చెత్త సేకరించే రాఫియల్ ఇస్లాం అంటున్నారు. "ఆహారం, నీరు, పెళ్లికి డబ్బు లేదా మరణానికి డబ్బు, ఇలా ఎవరికి ఏ అవసరం వచ్చినా అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. లాక్డౌన్ సమయంలో, అతడిని సహాయం అడిగిన ప్రతి ఒక్కరికీ డబ్బు, రేషన్, బట్టలు, మందులతో సహా సహాయం చేసాడు. అతనిని చూసినప్పుడు చాలా సంతోషించాను. నా జీవితమంతా ఢిల్లీలో అతని లాంటి వ్యక్తిని చూడలేదు. అతను ఇతరులకు ఇచ్చే గౌరవం, మా ఇళ్లలో కూడా మాకు అలాంటి గౌరవం లభించదు అని అంటారు నటరాజన్ గురించి తెలిసిన, సహాయం పొందిన స్థానికులు.

Tags

Read MoreRead Less
Next Story