వావ్.. రూ.999కే విమానం ఎక్కేయొచ్చు.. ఎక్కడికి వెళ్లొచ్చంటే..

ఒక్కసారైనా విమానం ఎక్కాలన్న కోరిక ఉంటే హ్యాపీగా ఇప్పుడు తీర్చేసుకోవచ్చు. స్టేట్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా తన ప్రాంతీయ అనుబంధ సంస్థ అలయన్స్ ఎయిర్ తన ప్రయాణీకుల కోసం ఓ గొప్ప ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద ప్రయాణీకులు రూ.999లు చెల్లించి విమాన టికెట్ బుక్ చేసుకోవచ్చు. మొదట బుక్ చేసుకున్న వారికి మాత్రమే ప్రాధాన్యత. 60 వేల మందికి మాత్రమే అవకాశం. ఇక ఏయే మార్గాల్లో ప్రయాణించే వారికి ఈ అవకాశం ఉందీ అంటే.
కంపెనీ ఆఫర్ ఢిల్లీ, జైపూర్, ప్రయాగరాజ్, హైదరాబాద్, బెల్గాం, అహ్మదాబాద్ , కండ్ల, బెంగళూరు, కొచ్చి, కోజికోడ్ మార్గాల్లో ప్రయాణించే వారి కోసం ఈ అవకాశం.
రేపటి నుంచే టికెట్ అమ్మకాలు ప్రారంభం..
అలయన్స్ ఎయిర్ యొక్క ఈ సెల్ రెండు రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. ఇది రేపు ప్రారంభమవుతుంది. అంటే మార్చి 13 నుంచి 15 వరకు నడుస్తుంది. ఇప్పుడు బుక్ చేసుకున్న వారు ఏప్రిల్ 1 నుండి సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణిస్తారు.
ఫస్ట్ కమ్ ఫస్ట్ బుకింగ్..
కంపెనీ తన ప్రకటనలో అలయన్స్ ఎయిర్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎయిర్ టికెట్లను అందిస్తోందని తెలిపింది. ఇది సాధారణ ప్రజలకు లగ్జరీ విమానాలలో ప్రయాణించడానికి అవకాశం ఇస్తుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రాతిపదికన టికెట్ల బుకింగ్ జరుగుతుంది.
ఇటీవల అలయన్స్ ఎయిర్ మరియు ప్రైవేట్ ఎయిర్లైన్స్ విస్టారా కొత్త విమానాలను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించాయి. అలయెన్స్ ఢిల్లీ-డెహ్రాడూన్-పంత్‌నగర్ విమానాలను తిరిగి ప్రారంభించినట్లు అలయన్స్ ఎయిర్ ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com