ఐ యాం హ్యాపీ.. నాకు నెగిటివ్.. మీరూ ఇలా చేస్తే..: అల్లు శిరీష్

ఐ యాం హ్యాపీ.. నాకు నెగిటివ్.. మీరూ ఇలా చేస్తే..: అల్లు శిరీష్
ఈ సెలబ్రేషన్స్‌లో నూతన దంపతులు నిహారిక, చైతన్యలు కూడా ఉన్నారు. అయితే వారిప్పుడు..

మెగా ఫ్యామిలీలోకి కరోనా ప్రవేశించింది.. ఇప్పటికే రాం చరణ్‌, వరుణ్ తేజ్‌ పాజిటివ్ అని ప్రకటించారు. దాంతో ఇప్పుడు ఫ్యామిలీ అంతా టెస్ట్‌లు చేయించుకునే పనిలో బిజీగా ఉన్నారు. క్రిస్‌మస్‌కి ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. పార్టీలో చరణ్, వరుణ్ అంతా కలిసారు.

ఆ పిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అల్లు శిరీష్. ఈ సెలబ్రేషన్స్‌లో నూతన దంపతులు నిహారిక, చైతన్యలు కూడా ఉన్నారు. అయితే వారిప్పుడు హనీమూన్ ట్రిప్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక చరణ్‌తో పాటు ఉన్న ఉపాసనకి నెగిటివ్ వచ్చినా.. పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, అందుకే భార్యాభర్తలు ఇద్దరూ క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే అల్లు శిరీష్.. తాను కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని తనకి నెగిటివ్ వచ్చిందని పోస్ట్ పెట్టారు. కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ కూడా పోస్ట్ చేశారు. ''రెండు సార్లు టెస్ట్ చేయించుకుంటే రెండు సార్లూ నెగిటివ్ వచ్చింది. దీంతో నేను ఊపిరి పీల్చుకున్నాను, నెగిటివ్ వచ్చినందుకు సంతోషిస్తున్నాను.

కాకపోతే కోవిడ్‌కు సంబంధించిన కొన్ని సూచనలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను.. నేను చాలా ప్రదేశాలు తిరిగాను.. చాలా మందిని కలిసాను. అయినా కరోనా అటాక్ అవలేదు.. కారణం.. ఎక్కడికి వెళ్లినా మాస్క్ పెట్టుకున్నాను, శానిటైజర్ వాడాను, చాలా జాగ్రత్తలు పాటించాను. వీటితో పాటు ఆయుర్వేద పద్ధతులు కొన్ని పాటించాను.

కాబట్టి నాకు అటాక్ కాలేదని నేను భావిస్తున్నాను. కావునా మీరందరూ కూడా వ్యాక్సిన్ వచ్చే వరకు మాస్క్‌లు మస్ట్‌గా ధరించండి.. ఆయుర్వేద పద్దతులు పాటించడండి'' అంటూ అల్లు శిరీష్ పోస్ట్ పెట్టారు.

Tags

Next Story