Reliance: ముకేశ్ అంబానీకి సీనియర్ సలహాదారుగా అలోక్ అగర్వాల్..

Reliance: ప్రస్తుతం 2011 నుంచి కంపెనీ జాయింట్ సీఎఫ్‌ఓగా ఉన్న వెంకటాచారి అలోక్ అగర్వాల్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. అగర్వాల్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీకి సీనియర్ సలహాదారుగా నియమితులయ్యారు. ఈ సమాచారాన్ని కంపెనీ శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. శుక్రవారం జరిగిన ఆర్‌ఐఎల్ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ ఆర్మ్‌లో $20 బిలియన్ల వాటాను అమెజాన్‌కు విక్రయించడానికి సన్నహాలు చేస్తోంది. “అగర్వాల్ నిష్ణాతుడైన ఫైనాన్స్ ప్రొఫెషనల్. అతను 2005లో కంపెనీకి CFOగా నియమితుడయ్యాడు. సంస్థ యొక్క ఎదుగుదలలో అలోక్ అగర్వాల్ చేసిన కృషిని బోర్డు ప్రశంసించింది" అని స్టాక్ ఫైలింగ్ పేర్కొంది.
అగర్వాల్ 1993లో రిలయన్స్‌లో చేరారు. 2005లో CFO అయ్యారు. అతను IIT కాన్పూర్, IIM అహ్మదాబాద్‌లలో తన విద్యాభ్యాసం పూర్తి చేశారు. రియలెన్స్ కంటే ముందు, అతను 12 సంవత్సరాలు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పనిచేశారు. గత 30 ఏళ్లలో రిలయన్స్ బహుళ రెట్లు వృద్ధి చెందడంలో అగర్వాల్ కీలక పాత్ర పోషించారు. అతను చేరినప్పుడు, రిలయన్స్ వార్షిక టర్నోవర్ రూ.4,100 కోట్లతో బ్యాలెన్స్ షీట్ పరిమాణం రూ.6,100 కోట్లు. అతని పర్యవేక్షణలో, కంపెనీ ఆదాయంలో దాదాపు 240 రెట్లు పెరిగింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com