Amarnath Yatra: మళ్లీ ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్ర..

Amarnath Yatra: మళ్లీ ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్ర..
Amarnath Yatra: రెండేళ్ల తర్వాత మళ్లీ అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు ప్రకటన చేసింది

Amarnath Yatra: రెండేళ్ల తర్వాత మళ్లీ అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు ప్రకటన చేస్తూ, ఈ ఏడాది యాత్ర జూన్ 30 నుంచి ప్రారంభమై 43 రోజుల తర్వాత ఆగస్టు 11న రక్షాబంధన్ రోజున ముగుస్తుందని తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

2019లో, జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుకు ముందు, అమర్‌నాథ్ యాత్రను మధ్యలోనే రద్దు చేశారు. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. దీని తర్వాత, కరోనా మహమ్మారి కారణంగా ప్రయాణం రెండేళ్లపాటు వాయిదా పడింది. 56 రోజుల ప్రయాణం గురించి 2021లో ప్రకటించబడింది, కానీ తర్వాత కరోనా కారణంగా వాయిదా పడింది.

2022 అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు

2022 అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 11 నుండి ప్రారంభమవుతుంది. యాత్ర జూన్ 30 నుండి ఆగస్టు 11 వరకు కొనసాగుతుంది.

కరోనా మహమ్మారి తర్వాత ఇది మొదటి అమర్‌నాథ్ యాత్ర. కావునా భక్తులందరూ తప్పనిసరిగా కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించవలసి ఉంటుంది.

13 ఏళ్లలోపు 75 ఏళ్లు పైబడిన వారు, 6 వారాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న గర్భిణీ స్త్రీలు ప్రయాణించడానికి అనుమతించబడరు.

హెలికాప్టర్‌లో ప్రయాణించే వారిని మినహాయించి, పహల్గామ్, బల్తాల్ యాత్ర మార్గాల్లో రోజుకు 10,000 మంది యాత్రికులను అనుమతించడానికి అమర్‌నాథ్ బోర్డు అంగీకరించింది.

ఈసారి బల్తాల్ నుంచి డోమెల్ వరకు 2 కిలోమీటర్ల ప్రయాణ మార్గంలో ఉచిత బ్యాటరీ వాహన సౌకర్యాన్ని పొడిగించాలని నిర్ణయించారు.

అమర్‌నాథ్ యాత్ర భద్రత కోసంసుమారు లక్ష మంది సిబ్బందిని మోహరించే యోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సీఆర్పీఎఫ్ సిబ్బంది నేతృత్వం వహిస్తారు.

ఈసారి అమర్‌నాథ్ యాత్రకు 10 లక్షల మందికి పైగా భక్తులు హాజరుకావచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story