Amaravati Farmers: హస్తిన వేదికగా అమరావతి రైతుల ఆందోళన..

Amaravati Farmers: హస్తిన వేదికగా అమరావతి రైతుల ఆందోళన..
Amaravati Farmers: హస్తిన వేదికగా ఆందోళనకు సిద్ధమయ్యారు అమరావతి రైతులు. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర అమరావతి రైతులు ధర్నా చేయనున్నారు.

Amaravati Farmers: హస్తిన వేదికగా ఆందోళనకు సిద్ధమయ్యారు అమరావతి రైతులు. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర అమరావతి రైతులు ధర్నా చేయనున్నారు. రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నారు. ధరణికోట నుంచి ఎర్రకోట పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రేపు, ఎల్లుండి జంతర్‌ మంతర్ దగ్గర రైతులు నిరసన దీక్షలు చేయనున్నారు.


ఏపీకి మూడు రాజధానులు రావొచ్చంటూ అసెంబ్లీలో సీఎం జగన్‌ చేసిన ప్రకటనకు రేపటితో మూడేళ్లు పూర్తికానుంది. 2019 డిసెంబర్‌ 17న అసెంబ్లీలోఅసెంబ్లీలో మాట్లాడిన జగన్‌ అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని చెప్పారు. అమరావతిలో లెజిస్లెటివ్‌, విశాఖలో ఎగ్జిక్యూటివ్, కర్నూలులో జ్యుడిషియల్‌ క్యాపిటల్‌ పెట్టొచ్చన్నారు. సౌతాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్న విషయాన్ని జగన్‌ తన ప్రసంగంలో ప్రస్తావించారు. కొత్తగా నిర్మించాలంటే డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయన్నారు. విశాఖలో ఒక్క మెట్రో కట్టుకుంటే సరిపోతుంది కదా అన్నారు.


రాజధాని విషయంలో జగన్ సర్కార్ తీరుతో ఏపీలో అనిశ్చితి నెలకొంది. దీంతో అమరావతి రైతులు ఆందోళన మొదలు పెట్టారు. ఏపీకి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ మూడేళ్లుగా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమరావతి నుంచి తిరుపతికి, అరసవెల్లికి పాదయాత్రలు చేపట్టారు. జగన్‌ సర్కార్‌ తీరుతో ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి.


అభివృద్ధి వికేంద్రీకరణే మా విధానం అంటూప్రాంతాల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్‌. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ఆత్మగౌరవ, గర్జన సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల మధ్య వైషమ్యాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబాటు పేరుతో కృత్రిమ ఉద్యమాలను చేపట్టి ప్రజలను రెచ్చగొడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story