నిర్మలా సీతరామన్‌ను కలిసిన అమరావతి మహిళా జేఏసీ నేతలు

నూతన వ్యవసాయ చట్టంతో ఎలాంటి నష్టం జరగదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా భరోసా ఇచ్చారు. రైతు సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. విజయవాడలో పర్యటించిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జక్కులనెక్కలం వ్యవసాయ క్షేత్రంలో రైతులతో ముందుగా మట్లాడారు. రైతులు పండిస్తున్న పంటలు, గిట్టుబాటు ధరలకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ లో ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు.
రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకొనేందుకు అవకాశం కల్పించామని గుర్తు చేశారు. కరోనా కారణంగా రైతులకు కలిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని నిర్మాలా సీతారమన్ హామీ ఇచ్చారు. అలాగే కార్మిక చట్టంలో అనేక సంస్కరణలు చేస్తున్నట్లు వెల్లడించారు.
వ్యవసాయ చట్ట సవరణలు చేసి వాటిని అందరికీ తెలిసే చేసేందుకే దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నామన్నారు. రైతులకు ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో కొత్త చట్టం చేశామన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవస్థ వేరేగా ఉంది. ప్రతి చోటా, ప్రతి రాష్ట్రంలో పన్నులు చెల్లించాల్సిన అవసరం ఇక ఉండదన్నారు.
మరోవైపు అమరావతి మహిళా జేఏసీ నేతలు.. విజయవాడ పర్యటనలో ఉన్న నిర్మలా సీతరామన్ ను కలిశారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతే ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం, చెరుకు పంటలకు గిట్టుబాటు ధర ఉండట్లేదని.. చెరుకు పంటకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని రైతులు కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com