Amarinder Singh: పంజాబ్‌లో కొత్త పార్టీ.. మాజీ సీఎం అమరీందర్ సింగ్ నిర్ణయం..

X
Amarinder Singh (tv5news.in)
Amarinder Singh: పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీపై నేడు స్పష్టత రానుంది. ఇటీవల కాంగ్రెస్కు రాజీనామా చేసిన అమరీందర్ సింగ్.. ఇవాళ తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేయనున్నారు. ఇటీవల తన కొత్త పార్టీ స్థాపనపై అమరీందర్ సూచనలు ఇచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమరీందర్ సింగ్ రాజీనామా పంజాబ్ కాంగ్రెస్ వర్గాల్లో గందరగోళానికి దారి తీసింది. గత నెల 18న కాంగ్రెస్కు రాజీనామా చేసిన అమరీందర్ సింగ్.. ఆ పార్టీలో ఎదుర్కొన్న అవమానాలే తన రాజీనామాకు కారణమని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
