Amarinder Singh Raja Warring : పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అమరీందర్

Amarinder Singh Raja Warring : పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా కొత్తగా నియమితులైన అమరీందర్ సింగ్ రాజా వారింగ్ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. వారింగ్‌తో పాటు, వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ ఆశు కూడా బాధ్యతలు తీసుకున్నారు.
చండీగఢ్‌లోని పంజాబ్ కాంగ్రెస్ భవన్‌లో పార్టీ సీనియర్ నేతల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటుగా, కార్యకర్తలు కూడా పాల్గోన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అతిచిన్న వయస్కుడిగా అమరీందర్ సింగ్ రాజా వారింగ్(44) రికార్డు సృష్టించారు.
బాధ్యతల అనంతరం అమరీందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతానని. క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తానన్నారు . అమరీందర్ సింగ్ రాజా ఎవరో కాదు.. ఇటీవలి పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ పరాజయం తర్వాత పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ వారసుడే.
ముక్త్సర్ జిల్లాలోని గిద్దర్‌బాహా నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అమరీందర్ .. గతంలో రవాణా శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. తనను పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పార్టీ నాయకత్వానికి వారింగ్ కృతజ్ఞతలు తెలిపారు.
Amarinder Singh Raja Warring Ji who took over as the youngest ever PCC President and spelt out his 3-D mantra of discipline, dedication and dialogue to strengthen the party. Bharat Bhushan Ashu Ji also took charge as the Working President.@RajaBrar_INC@BB__Ashu pic.twitter.com/ufDzWdsXAo
— Punjab Congress (@INCPunjab) April 22, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com