Ambani: అంబానీ ఇంట పెళ్లి సందడి
Rajasthan

Ambani: అంబానీ ఇంట పెళ్లి సందడి
వరుస శుభకార్యాలతో అంబానీల ఇల్లు వెలిగిపోతోందనే చెప్పాలి. ఇటీవలే ముఖేశ్ అంబానీ తనయ ఈషా అమెరికాలో కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మొన్నే చిన్నారులతో సహా ఇంటికి చేరుకున్న ఈషాకు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తాజాగా అనంత్ అంబానీ పెళ్లి ముచ్చటతో వారి ఇంట సందడి నెలకొంది.
అనంత్ కు, రాథిక మర్చెంట్ వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. తాజాగా ఇరువురికీ రాజస్థాన్ లోని నట్ ద్వారాలో శ్రీనాథ్ జీ దేవాలయంలో నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో అతి కొద్ది మంది అతిథుల నడుమ అనంత్, రాధికకు రోకాను నిర్వహించినట్లు తెలుస్తోంది.
ప్రముఖ వజ్రాల వ్యాపారవేత్త విరన్ మర్చెంట్, షైలా మర్చెంట్ ల తనయ రాధిక న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో పాలటిక్స్, ఎకనామిక్స్ విభాగంలో డిగ్రీ పూర్తిచేసింది. సంప్రదాయ నృత్యకళల్లోనూ ఆరితేరిన రాధిక అంబానీల కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండేది. 2018లో ఈషా అంబానీ వివాహ వేడుకలోనూ రాధిక నృత్య ప్రదర్శన ఇచ్చింది. మరి చూడచక్కనైన ఈ జంట త్వరలోనే వైవాహిక బంధంలోకి ప్రవేశిస్తారని ఆశిద్దాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com