Ambani: దేశంలో అత్యంత సంపన్నుడు అంబానీనే

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ దేశంలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించారు. ఇప్పటి వరకు తొలి స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ రెండో స్థానానికి పడిపోయారు. 84.3 బిలియన్ డాలర్ల సంపదతో అంబానీ మొదటి స్థానానికి చేరగా 83.9 బిలియన్ డాలర్ల సంపదతో అంబానీ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఈ మేరకు ఫోర్బ్స్ సంస్థ రియల్ టైమ్ బిలియనీర్స్ -2023 జాబితాను వెల్లడించింది.
అంబానీ సంపద 0.19 శాతం వృద్ధితో 164 మిలియన్ డాలర్‌లు పెరుగగా, అదానీ సంపద 4.62 శాతం నష్టంతో 84.1 బిలియన్ డాలర్‌లు కరిగిపోయిందని ఫోర్బ్స్ నివేదిక తెలిపింది. హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్‌లో షేర్‌లు భారీ నష్టాలు మూటగట్టుకుంటున్నాయి. దాంతో ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ 10వ స్థానానికి పడిపోయారు. ఇక అంబానీ ఒక అడుగు ముందుకేసి 9వ స్థానంలో కొనసాగుతున్నారు. అయితే ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో ఫ్రెంచ్ ఫ్యాషన్ దిగ్గజం LVMH అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ అగ్రస్థానం దక్కించుకున్నారు. టెస్లా, స్పేసెక్స్ అధినేత ఎలాన్ మస్క్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com