Olive Trees: అంబానీ అదే రోజు ఆలివ్ చెట్టును ఎందుకు కొన్నారంటే..

Olive Trees: ఆలివ్ చెట్లు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా ఆలివ్ ఆయిల్ వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇదంతా చాలామందికి తెలిసిన విషయమే. కానీ ఇవి తెలిసినా కూడా ఆలివ్ చెట్టును ఇప్పటివరకు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ అంబానీ వల్ల ఒక్కసారిగా ఆలివ్ చెట్టు గురించి అందరూ తెలుసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి సమీపంలోని కడియం వద్ద ఉన్న నర్సరీ నుండి 200 ఏళ్ల నాటి చెట్టును అంబానీ ప్రత్యేకంగా ఆర్డర్ చేసి తన ఇంటికి రప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చెట్లు 200 ఏళ్లు బతుకుతాయా. అసలు ఈ చెట్టులో ఉన్న ప్రత్యేకత ఏంటి అని నెటిజన్లు తెగ గూగుల్ చేయడం మొదలుపెట్టారు.
ఆలివ్ చెట్టు అనేది శాంతికి నిదర్శనం అని చాలామంది పర్యావరణవేత్తలు చెప్తుంటారు. ఇవి వాతావరణాన్ని కరెక్ట్‌గా ఉంచడానికి కూడా ఉపయోగపడతాయి. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ అనేది మనుషుల భవిష్యత్తును అయోమయంలో పడేసింది. కానీ ఆలివ్ చెట్లను ఎక్కువగా పెంచడం వల్ల గ్లోబల్ వార్మింగ్ వల్ల కలుగుతున్న పర్యావరణ మార్పులు తగ్గిపోతాయి.
ఆలివ్ చెట్ల వల్ల వచ్చే పండ్ల వల్ల మాత్రమే కాదు ఆయిల్ వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆలివ్ ఆయిల్‌తో ఆహారాన్ని తీసుకోవడం వల్ల హార్ట్ కూడా హెల్తీగా ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధులను దూరం చేయడానికి ఆలివ్ ఆయిల్ ఉపయోగపడుతుంది. క్యాన్సర్ రాకుండా కూడా ఆలివ్ మనల్ని కాపాడుతుంది. ఇంతే కాదు మరెన్నో ఉపయోగాలు కూడా ఆలివ్ మనకు అందిస్తుంది.
అందుకే ఈ మధ్య ఆలివ్ చెట్లకు డిమాండ్ ఎక్కువగా పెరుగుతందని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. కానీ అంబానీ అంత స్పెషల్‌గా నవంబర్ 26నే ఆలివ్ చెట్టును కొనుగోలు చేయడానికి కూడా ఒక కారణం ఉంది. నవంబర్ 26న వరల్డ్ ఆలివ్ ట్రీ డే. గత రెండేళ్లుగా ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటోంది యూనెస్కో. అందుకే అంబానీ కూడా వరల్డ్ ఆలివ్ ట్రీ డే రోజే ప్రత్యేకంగా ఆలివ్ చెట్టును కొనుగోలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com