తండ్రి రైతు కూలీ.. కుమార్తె అమెరికా గాట్ టాలెంట్ వేదికపై..

తండ్రి రైతు కూలీ.. కుమార్తె అమెరికా గాట్ టాలెంట్ వేదికపై..
నీ కూతుర్ని బివాష్ సార్ దగ్గరకు తీసుకెళ్లు. గొప్ప డ్యాన్సర్ ని చేస్తాడు అని చెప్పారు.

మూడేళ్ల వయసులోనే కూతురు నాట్యం చేస్తుంటే మురిసిపోయాడు తండ్రి మజుందార్. ఎలాగైనా కష్టపడి తన కూతుర్ని గొప్ప డ్యాన్సర్ చేయాలనుకున్నాడు. బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న పశ్చిమ బెంగాల్ లోని షోలోర్దారీ అనే గ్రామంలో సోనాలి కుటుంబం నివసిస్తోంది. తండ్రి వరి, అరటి, కూరగాయలు పండించే రైతు, తల్లి గృహిణి. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు సోనాలి డ్యాన్స్ ని చూసి ఆమె తండ్రికి.. నీ కూతుర్ని బివాష్ సార్ దగ్గరకు తీసుకెళ్లు. గొప్ప డ్యాన్సర్ ని చేస్తాడు అని చెప్పారు. ఆ మాటతో బిడ్డని తీసుకుని కోల్‌కతాకు పయనమయ్యాడు తండ్రి. అప్పుడు సోనాలీ వయసు ఏడు సంవత్సరాలు.

బివాష్‌తో మాట్లాడిన తరువాత, ఆమెకు సరైన గురువు దొరికాడని సోనాలి తండ్రికి నమ్మకం కలిగింది. "ఒక రైతుగా, నాన్న ఆ సమయంలో రోజుకు 80 రూపాయలు సంపాదించేవాడు. నా కలను నెరవేర్చే ఆర్థిక స్థోమత నా తండ్రికి లేదు. గ్రామంలో ఉంటే డ్యాన్స్ నేర్చుకోవడం కష్టమని నన్ను కోల్‌కతాలో విడిచిపెట్టాడు. ప్రారంభంలో, నేను ఇంటిని, అమ్మని చాలా మిస్సయానని బాధపడేదానిని.. ఆ తరువాత అలవాటైపోయింది. డ్యాన్స్ నేర్చుకోవడం మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టేదాన్ని. దాంతో నాకు తెలియకుండానే సమయం గడిచిపోయేది అని 16 ఏళ్ల ప్రాయంలో ఉన్న సోనాలి ఆనాటి రోజుల్ని గుర్తుచేసుకుంటుంది.

సోనాలితో పాటు డ్యాన్స్ చేసే మరో వ్యక్తి సుమంత్.. డ్యాన్స్ అంటే చిన్నప్పటి నుంచి సుమంత్ కి కూడా చాలా ఇష్టం. తండ్రి రైల్వేలో పనిచేస్తున్నాడు. అతడు బివాష్ అకాడమీలో చేరి డ్యాన్స్ నేర్చుకుంటున్నాడు. అకాడమీలో శిక్షణ పొందినవారు భారతదేశపు గాట్ టాలెంట్ వేదికపై డ్యాన్స్ చేసేందుకు సెలెక్ట్ అయ్యారు. వీరిద్దరి అత్యుత్తమ ప్రదర్శన చూసి జడ్జిలు ఆశ్చర్యపోయారు. ఫాటా పోస్టర్ నిక్లా హీరో చిత్రంలోని ధాటింగ్ నాచ్ సాంగ్ కి ఈ జంట అద్భుతమైన నృత్యం చేసింది. సోనాలిని ప్రశంసలతో ముంచెత్తారు. సోనాలి కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుని ఆమె పట్ల మరింత గౌరవాన్ని కనబరిచారు. కూతురు డ్యాన్స్ షోస్ ద్వారా సంపాదించిన డబ్బుతో తండ్రి ఊర్లో ఇల్లు, భూమి కొన్నాడు. అంత గొప్ప కూతురిని కన్నందుకు నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడివి అని గ్రామస్థులు పొగుడుతుంటే ఒకింత గర్వంగా అనిపించేది మజుందార్ కి.

Tags

Read MoreRead Less
Next Story