బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. 15 రోజులు చికెన్ షాపులు బంద్..

నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. 15 రోజుల పాటు చికెన్ షాపులు బంద్ అవుతున్నాయి. బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. కరోనాతో కోలుకోలేకుండా ఉన్న ప్రజల్ని బర్డ్ ఫ్లూ వచ్చి మరింత ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే కేరళ, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ తీవ్ర రూపం దాల్చింది. మధ్యప్రదేశ్‌లో అయితే మరీ ఎక్కువగా ఉంది.
ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంద్సౌర్ జిల్లా వ్యాప్తంగా 15 రోజుల పాటు చికెన్ సెంటర్లు మూసివేస్తున్నారు. కోడిగుడ్డు విక్రయాలను కూడా నిషేధించారు. మరికొన్ని జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా మరణాలు కూడా సంభవించాయి. ఈ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ మాట్లాడుతూ ఇండోర్‌లో చనిపోయిన కాకుల్లో ఏవయన్ ఇన్ఫుఎంజా (బర్డ్ ఫ్లూ) గుర్తించారు.
2020 డిసెంబర్ 23 నుంచి 2021 జనవరి 3 వరకు మధ్యప్రదేశ్ ఇండోర్‌లో 142, మాంద్సౌర్‌లో 100, అగర్-మాల్వాలో 112, ఖార్గోన్‌లో 13, సెహోర్ జిల్లాలో తొమ్మిది కాకులు మరణించినట్లు అధికారులు తెలిపారు. కేరళలోనూ బర్డ్ ఫ్లూ వైరస్‌ని గుర్తించారు. దీని కారణంగా ఇప్పటికే ఈ ప్రాంతంలో 12 వేల బాతులు మరణించగా, మరో 36000 బాతులు చనిపోయే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com