కేబీసీలో తెలంగాణ టీచర్.. అమితాబ్ ముందు హాట్ సీట్‌లో కూర్చుని..

బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి సక్సెస్‌ఫుల్‌గా రన్నవుతున్న షో. 11 సీజన్స్ పూర్తి చేసుకుని 12వ సీజన్‌లోకి అడుగుపెడుతున్న కేబీసీ అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ని సొంతం చేసుకుంటోంది. ఇటీవలే ప్రారంభమైన 12వ సీజన్ సోమవారం నాటి ఎపిసోడ్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. వారిలో ముందుగా బజర్ మోగించిన ప్రదీప్ కుమార్ హాట్ సీట్‌లో కూర్చుని గేమ్ ఆడారు. 12.5 లక్షలు గెలుచుకుని ఆట నుంచి క్విట్ అయ్యారు. అతడి తర్వాత కేబీసీలో పాల్గొనే అవకాశం తెలంగాణ ఆల్వాల్‌కు చెందిన సబితా రెడ్డికి తగ్గింది.
కంప్యూటర్ టీచర్‌గా పనిచేస్తున్న 44 ఏళ్ల సబిత భర్త అనారోగ్యంతో మృతి చెందారు. ఇద్దరు పిల్లలని తానే పెంచి పెద్ద చేస్తున్నారు. ఇద్దరు పిల్లలను బాగా చదివించడమే తన ఆశయమని చెబుతారు. పిల్లలకు ఆస్తులు ఇవ్వలేకపోయినా మంచి విద్యను అందించాలనేది తన లక్ష్యమని అందుకోసమే తాను కేబీసీ బాగా ప్రిపేర్ అయ్యి వచ్చానని అన్నారు. అమితాబ్‌ని చూస్తానని కలలో కూడా అనుకోలేదని, ఇది తనకు వచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నానని అన్నారు. మంగళవారం రాత్రి సబితా రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ సోనీటీవీలో ప్రసారం కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com