మరోసారి ఆస్పత్రిలో చేరిన అమిత్ షా

X
By - shanmukha |13 Sept 2020 10:55 AM IST
కేంద్రమంత్రి అమిత్ షా మరోసారి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. శనివారం రాత్రి 11 గంటలకు షా ఎయిమ్స్‌లోని కార్డియో
కేంద్రమంత్రి అమిత్ షా మరోసారి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. శనివారం రాత్రి 11 గంటలకు షా ఎయిమ్స్‌లోని కార్డియో న్యూరో టవర్‌లో అడ్మిట్ అయ్యారు. ఇటీవల కరోనాతో కోలుకున్న ఆయనల రెండు సార్లు ఆస్సత్రిలో చేరారు. ప్రస్తుతం శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. కరోనా సోకడానికి ముందు కూడా ఆయన ఎయిమ్స్ లో అనారోగ్యంతో చికిత్స పొందారు. తరువాత ఆగస్టు 31 డిశ్చార్జ్ అయిన ఆయన కరోనాతో ఆగస్టు 2న గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఆగస్టు 14న అమిత్‌షాకు కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. తిరిగి 4 రోజుల్లోనే ఆగస్టు 18న అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరారు. మళ్లీ శనివారం రాత్రి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com