పీఎంఓలో సేవలందించనున్న అందాల అమ్రపాలీ

పీఎంఓలో సేవలందించనున్న అందాల అమ్రపాలీ
పలు స్థాయిలో సేవలందించిన ఐఏఎస్ అధికారిణి అమ్రపాలి మరో గొప్ప అవకాశాన్ని సొంత చేసుకుంది.

పలు స్థాయిలో సేవలందించిన ఐఏఎస్ అధికారిణి అమ్రపాలి మరో గొప్ప అవకాశాన్ని సొంత చేసుకుంది.. ప్రధానమంత్రి కార్యాలయంలో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె కూడా చోటుదక్కించుకుంది. పీఎంఓలో డిప్యూటీ కార్యదర్శిగా బాధ్యతులు స్వీకరించిన 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. 2010 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఆమె ఇప్పటికే పలు స్థాయిల్లో తమ సేవలు అందించారు. వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. ఈ ఏడాది కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిన ఆమె ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. తాజా పీఎంఓలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైనట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story