Amruta Fadnavis: కేన్స్ ఈవెంట్ లో మెరిసిన మాజీ సీఎం భార్య..

Amruta Fadnavis: బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్‌ను 2005లో వివాహం చేసుకున్న సామాజిక కార్యకర్త శ్రీమతి అమృత ఫడ్నవీస్ ఆహారం, ఆరోగ్యం, స్థిరత్వం గురించి అవగాహన కల్పించడానికి కేన్స్ ఈవెంట్ 2022 కు హాజరయ్యారు. నల్లటి గౌనులో ఆమె అతిధులను ఆకర్షించారు. ఈవెంట్ కు సంబంధించిన కొన్ని చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ దంపతులకు దివిజ అనే కుమార్తె ఉంది.
అమృత ఫడ్నవీస్ విభిన్న రంగాలలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె క్లాసికల్ సింగర్, సామాజిక కార్యకర్త, ప్రొఫెషనల్ బ్యాంకర్. ఆమె మహారాష్ట్ర చరిత్రలో అతి పిన్న వయస్కురాలైన ప్రథమ మహిళ. ఈ స్వతంత్ర మహిళా సాధకురాలు నేడు యాక్సిస్ బ్యాంక్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు.
ఆమె మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఓ సాధారణ మహిళ. నాగ్‌పూర్‌లోని GS కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసారు. తరువాత, ఆమె MBA ఫైనాన్స్ చేసారు. పూణేలోని సింబయాసిస్ లా స్కూల్‌లో టాక్సేషన్ లా చదివారు. ఆమె రాష్ట్ర స్థాయి అండర్-16 టెన్నిస్ క్రీడాకారిణిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com