AMU : గణతంత్ర దినోత్సవంలో మతపరమైన నినాదాలు..!

AMU : గణతంత్ర దినోత్సవంలో మతపరమైన నినాదాలు..!
శుక్రవారం ప్రార్థనల అనంతరం అల్లాహు అక్బర్, నారా-ఇ-తక్బీర్ అంటూ నినదించారు


గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో మతపరమైన నినాదాలు చేసిన స్టుడెంట్ ను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ అల్లాహు అక్బర్ అని నినదించారు విద్యార్థులు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, అలీఘర్ ముస్లిం యునివర్సిటీలో జరిగింది. శుక్రవారం ప్రార్థనల అనంతరం అల్లాహు అక్బర్, నారా-ఇ-తక్బీర్ అంటూ నినదించారు. గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో వహిదుజ్జమా అనే విద్యార్థి, మత పరమైన నినాదాలు చేశాడు. దీంతో అతన్ని సస్పెండ్ చేశారు యాజమాన్యం. నినదించినపుడు అతడు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ( NCC) యునిఫాం ధరించాడు.

వహిదుజ్జమా అనే విద్యార్థిపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని తోటి విద్యార్థులు యునివర్సిటీలో 'అల్లాహు-అక్బర్' అంటూ నినదించారు. యునివర్సిటీ వీసీకి విద్యార్థులు మెమోరాండం సమర్పించి 'అల్లాహు అక్బర్, నారా-ఇ-తక్బీర్' అంటూ నినదించారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం జామా మసీదు నుంచి బాబా సయ్యద్ గేట్ వరకు పలువురు విద్యార్థులు నిరసన చేపట్టారు. ఒక వర్గం మతపరమైన నినాదాలు చేయడంతో మరో వర్గపు విద్యార్థులు కూడా మతపరమైన నినాదాలు చేశారు.

గుజరాత్ అల్లర్లపై బీబీసీ చిత్రీకరించిన డాక్యుమెంటరీ పోస్టర్లను క్యాంపస్ లో అంటించారు. ఈ విషయంపై యునివర్సిటీ ప్రోక్టర్ మొహమ్మద్ వసీం అలీ మాట్లాడారు. బీబీసీ డాక్యుంమెంట్ పోస్టర్లను బయట వ్యక్తులే అంటించారని చెప్పారు. గణతంత్ర దినోత్సవంలో మతపరమైన నినాదాలను ధృవీకరించారు.


Tags

Read MoreRead Less
Next Story