శ్రీమతి కోరికను కాదనలేని శ్రీవారు.. కారుని ఇల్లెక్కించారు..

శ్రీమతి కోరికను కాదనలేని శ్రీవారు.. కారుని ఇల్లెక్కించారు..
ఆమె అడిగిన వెంటనే కాదనలేకపోయారు.. కారుని ఇల్లెక్కించేశారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న సతి కోసం ఏదైనా చేయాలనుకున్నారు శ్రీవారు.. ఆమె అడిగిన వెంటనే కాదనలేకపోయారు.. కారుని ఇల్లెక్కించేశారు. బీహార్‌లోని భాగల్‌పూర్‌కు చెందిన ఒక వ్యక్తి తాను మొదటి ఉపయోగించిన కారు ఆకారంలో వాటర్ ట్యాంక్‌ను నిర్మించి టెర్రాస్‌పైన అమర్చారు. స్కార్పియో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ఆలోచన ఇంటసార్ భార్యది. ఆమె తాను ఆగ్రాలో ఇలాంటిదే చూశానని మన ఇంటికి కూడా ఏర్పాటు చేసుకుందామని భర్తకు చెప్పింది. భార్య కోరికను కాదనలేని ఇంటసార్ ట్యాంక్ కట్టించడానికి సిద్ధమైపోయాడు.

భాగల్పూర్‌లోని తన నివాసాన్ని సందర్శించి స్కార్పియో వాటర్ ట్యాంక్‌ను రూపొందించమని ఆగ్రాకు చెందిన కార్మికులను కోరారు. దానికోసం సుమారు రూ .2.5 లక్షలు ఖర్చు చేశారు.

ఆనంద్ మహీంద్రా రియాక్షన్

స్కార్పియో మహీంద్రా గ్రూప్ సంస్థకు చెందిన వాహనం. చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. కారుపై ఉన్న ప్రేమతో ఇంటసార్ ఇలా ఏర్పాటు చేసుకోవడం హర్షించదగిన విషయంగా పేర్కొన్నారు. వారి ఆలోచనకు హ్యాట్సాఫ్ చెప్పారు. ట్విట్టర్‌లో మహీంద్రా.. స్కార్పియో పైకప్పుకు పెరుగుతోంది. యజమానికి నా ప్రశంసలు. అతని మొదటి కారు పట్ల ఆయనకున్న అభిమానానికి మేము వందనం చేస్తున్నాం!" అని పేర్కొన్నారు.

Tags

Next Story