భుయాన్ 30 ఏళ్ల కష్టం.. ఆనంద్ మహీంద్రా సాయం

ఆ పెద్దాయన ప్రభుత్వాన్ని తిడుతూ కూర్చోలేదు.. తన కష్టాన్నే నమ్ముకున్నాడు.. తన ఒక్కడివల్ల అవుతుందో లేదో అని ఆలోచించలేదు.. ప్రయత్నం అయితే ప్రారంభిద్దాం.. అయినప్పటికే అవుతుందని అడుగు ముందుకు వేశాడు.. పలుగూ, పార చేతబట్టాడు.. ఒకటి రెండూ కాదు దాదాపు 30 ఏళ్లు తవ్వుతూనే ఉన్నాడు.. నిశ్శబ్ధంగా అతడు చేస్తున్న పనికి ప్రకృతి కూడా సహకరించింది.. పంట పొలాలకు పారే నీటిని అందించింది. 3 కి.మీ మేర అతడు కాలువను తవ్వి తన గ్రామంలోని కుంటలోకి నీరు వెళ్లేలా చేశాడు. బిహార్‌కు చెందిన భుయాన్ చేసిన పని వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రాను ఆకర్షించింది. ప్రశంసలతో పాటు కంపెనీకి చెందిన ట్రాక్టర్‌ను తాతకు బహుమతిగా అందించారు. మహీంద్రా చేసిన పనికి అతడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీ ఔదార్యం అనిర్వచనీయం.. మాటలకంటే చేతలు ముఖ్యమని మరోసారి నిరూపించారు.. ప్రపంచంలో మానవత్వం ఇంకా మిగిలే ఉందనడానికి మీరే నిదర్శనం అని మహీంద్రాను పొగడ్తలతో ముంచేస్తున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com