Anand Mahindra : మానవత్వం చాటుకున్న ఆనంద్ మహేంద్ర.. దివ్యాంగుడి కష్టాన్ని చూసి చలించిపోయి

Anand Mahindra : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర మరోసారి ఆయన తన ఉదారతను చాటుకున్నారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్‌కు నెటిజన్లు మానవత్వానికి సలాం అంటూ ట్విట్స్ చేస్తున్నారు. ఇంతకు ఆట్విట్‌లో ఏముందంటే ఈ వీడియో చూడండి.
ఢిల్లీకి చెందిన ఓ దివ్యాంగుడు ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఆసమయంలో అటుగా వెళ్తున్న వృద్ధుడు ఆ దివ్యాంగుడిని పలకరించి కుశల ప్రశ్నలు వేశాడు. దానికి దివ్యాంగుడు స్పందిస్తూ.. భార్య ఇద్దరు చిన్న పిల్లలతో పాటు వృద్ధుడైన తండ్రి ఉన్నాడని .. వారి పోషణ కోసం తానే సంపాదించాలని అతడు బదులిచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ వీడియోను చూసిన ఆనంద్ మహీంద్ర చలించిపోయారు. ఈ వీడియో ఇప్పటిదో, ఎక్కడిదో కూడా నాకు తెలీదు. కానీ, ఈ వీడియోలో ఉన్న వ్యక్తి వైకల్యంతో బాధపడుతున్నాడు. అతడి ఆత్మస్థైర్యం చూసి చాలా గొప్పగా అనిపించింది. మెయిల్ డెలివరీలో అతడిని బిజినెస్ అసోసియేట్‌గా నియమించడం సాధ్యమేనా?'' అంటూ ఆయన తన లాజిస్టిక్స్ కంపెనీ మేనిజంగ్ డైరెక్టర్, సీఈవో రామ్ ప్రవీణ్ స్వామినాథన్‌ను అడిగారు.
దీనికి ఆయన సమాధానమిస్తూ.. ''తప్పకుండా ఆనంద్ .. ఆయన మన డెలివరీ విభాగానికి ఒక ఆస్తిగా ఉంటాడని అని తెలిపారు. అతడికి ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధమైన ఆనంద్ మహీంద్రాను నెటిజనులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సార్.. థాంక్యూ.. అంటూ ఆ వ్యక్తి తరఫును కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com