Anand Mahindra: 48 గంటల్లో టన్నెల్ నిర్మాణం.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్..

Anand Mahindra: 48 గంటల్లో టన్నెల్ నిర్మాణం.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్..
Anand Mahindra: అనుకోవాలే కానీ అన్నీ సాధ్యమే.. సంకల్పానికి పట్టుదల కూడా తోడైతే ఎంతటి కష్టమైన కార్యాన్నానైనా పూర్తి చేయవచ్చని నిరూపించింది నెదర్లాండ్ ప్రభుత్వం.

Anand Mahindra: అనుకోవాలే కానీ అన్నీ సాధ్యమే.. సంకల్పానికి పట్టుదల కూడా తోడైతే ఎంతటి కష్టమైన కార్యాన్నానైనా పూర్తి చేయవచ్చని నిరూపించింది నెదర్లాండ్ ప్రభుత్వం. 48 గంటల్లో టన్నెల్‌ను నిర్మించి ప్రపంచం తమ గురించి మాట్లాడుకునేలా చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా నెదర్లాండ్స్‌లో హైవే టన్నెల్ నిర్మాణానికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు. డచ్‌ల మౌలిక సదుపాయాల నైపుణ్యాలు, దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయని ఆ దేశ సామర్థ్యాన్ని మహీంద్రా ప్రశంసించారు.

మైక్రో-బ్లాగింగ్ సైట్‌లో షేర్ చేసిన వీడియోలో హైవేపై సొరంగం నిర్మాణం చేపట్టి 48 గంటల్లో దాన్ని పూర్తి చేశారు. డచ్ వారు కేవలం రెండు రోజులు పని చేసి హైవే కింద సొరంగం నిర్మించారు. దీనినుంచి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. ఇది శ్రమను ఆదా చేయడం గురించి కాదు, సమయం ఆదా చేయడం గురించి. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఇది కూడా చాలా కీలకం. వేగవంతమైన మౌలిక సదుపాయాల కల్పన అంటే వేగవంతమైన వృద్ధి. అది అందరికీ ప్రయోజనకరంగా ఉండాలి అని పేర్కొన్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 1.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో 3,000 కంటే ఎక్కువ సార్లు రీట్వీట్ చేయబడింది. దాదాపు 29 లక్షల మంది వీక్షకులు వీడియోను లైక్ చేసారు. రోడ్లు, రైల్వేలు, జలమార్గాలు మరియు వాయుమార్గాలపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించే ప్రయత్నంలో, నెదర్లాండ్స్ ప్రభుత్వం మౌలిక రంగంలో అదనపు పెట్టుబడులు పెడుతోంది. కొత్త రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 25 బిలియన్ యూరోల నిధిని కేటాయించింది.

Tags

Read MoreRead Less
Next Story