ఆనంద్ మహీంద్రా ఇచ్చిన అద్భుతమైన పజిల్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించాలంటే వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి అని లాక్డౌన్ సమయంలో ప్రభుత్వాలు మొరపెట్టుకున్నాయి. ఏదో ఒక పని పేరుతో బయటకు వచ్చిన వారిని కట్టడి చేయలేక అధికారులు, పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్‌లో ఓ ఆసక్తికరమైన పజిల్‌ని పూరించమంటూ నెటిజన్లను కోరారు. మీరు విహారయాత్రలకు వెళ్లే అదృష్టాన్ని ఈ పజిల్ ద్వారా సొంతం చేసుకోవచ్చు అని ఓ ట్విస్ట్ ఇచ్చారు.
ఆహా! పజిల్ పూరిస్తేనే విహారయాత్రకు పంపిస్తారా అని ఆసక్తితో క్షణాల్లో పజిల్ పూరించారు. తీరా చూస్తే వచ్చిన ఆన్సర్ చూసి విస్తుపోయారు.. మీరు సూపర్.. ఇలాంటి ఆసక్తిదాయకమైన పోస్టులు ట్వీట్ చేయడంలో మీకు మీరే సాటి.. మీరు మాకు స్ఫూర్తి అంటూ ఆనంద్ మహీంద్రాపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అతని పోస్ట్‌లో గమ్యస్థానాల జాబితా.. న్యూజిలాండ్, మెక్సికో, కెనడా ఇలా వరుసగా మొత్తం 15 దేశాల పేర్లు ఉన్నాయి. వాటిలో ఒకటి నుంచి తొమ్మిది మధ్య ఏదైనా సంఖ్యను ఎన్నుకోవాలని సూచించారు. తరువాత దానిని మూడు చేత గుణించి, వచ్చిన సంఖ్యకు మూడు జోడించండి. రెండు అంకెలను కలిపితే వచ్చేదే తుది సమాధానం. దాని ప్రకారంగా ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించబడుతుంది అని అన్నారు.
వారు పొందే తుది సంఖ్య పక్కన వ్రాసిన గమ్యం వారు తదుపరి ప్రయాణించాల్సిన ప్రదేశం. ఆనంద్ మహీంద్రా యొక్క పోస్ట్ మీరు ఎక్కడకు వెళ్లాలో నిర్ణయించడంలో మీకు సహాయపడుతుంది. ఈ పజిల్‌లోని ట్విస్ట్ ఏమిటంటే, మీరు మొదటి దశలో ఏ సంఖ్యను ఎంచుకున్నా, తుది సమాధానం ఎల్లప్పుడూ తొమ్మిది అవుతుంది - అదే "ఇంట్లో ఉండండి". "కష్టమే కానీ తప్పదు." ఆనంద్ మహీంద్రా పజిల్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో ప్రశంసలు అందుకుంది, ఇంటి లోపల ఉండవలసిన అవసరాన్ని వివరిస్తున్నందుకు ప్రశంసలు అందుకుంటున్నారు.
Brutal! But accurate... pic.twitter.com/iZxC9EvMWx
— anand mahindra (@anandmahindra) November 24, 2020
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com