Tamilnadu: పెట్ డాగ్‌ని కుక్క అని పిలిచాడని 62 ఏళ్ల వృద్ధుడిని..

Tamilnadu: పెట్ డాగ్‌ని కుక్క అని పిలిచాడని 62 ఏళ్ల వృద్ధుడిని..
Tamilnadu: తమిళనాడులో పెంపుడు కుక్కను కుక్క అని పిలిచినందుకు కోపంతో 62 ఏళ్ల వృద్ధుడిని చంపేశారు.

Tamilnadu: తమిళనాడులో పెంపుడు కుక్కను కుక్క అని పిలిచినందుకు కోపంతో 62 ఏళ్ల వృద్ధుడిని చంపేశారు. తమ పెంపుడు జంతువును 'కుక్క' అని పిలిచినందుకు వృద్ధుడి ఛాతీపై పిడిగుద్దులు గుద్దారు. దాంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.




దిండిగల్ జిల్లాకు చెందిన రాయప్పన్‌ పక్కింటి వాళ్లు పెంచుకుంటున్న పెట్ డాగ్‌ని పేరు పెట్టి పిలవకుండా కుక్క అని సంబోధిస్తుంటారు. దీంతో వాళ్లకి చిర్రెత్తుకొచ్చేది. రాయప్పన్‌ను చాలా సార్లు హెచ్చరించారు అలా పిలవొద్దని. అదే అతడి ప్రాణాల మీదకు తీసుకు వచ్చింది.




సమీపంలోని తమ పొలంలో నడుస్తున్న బోరు స్విచ్ ఆఫ్ చేయమని రాయప్పన్ తన మనవడు కెల్విన్‌‌కు చెప్పారు. పొరుగింటి వారి కుక్క బయట ఉందేమో జాగ్రత్త కర్ర తీసుకుని వెళ్లు అని మనవడిని హెచ్చరించాడు రాయప్పన్. అలాగే తాత అంటూ మనవడు ముందుకు కదిలాడు.




కానీ అది విన్న పొరుగింటి వ్యక్తి డానియల్ కోపంతో రాయప్పన్ దగ్గరకు వచ్చి ఛాతీపై కొట్టాడు. ఎన్నిసార్లు చెప్పాలి కుక్క అని పిలవొద్దని అంటూ అదే పనిగా అతడిని పిడిగుద్దులు గుద్దాడు. దాంతో రాయప్పన్ కుప్పకూలి పోయాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో భయపడిపోయిన డేనియల్ కుటుంబం అక్కడి నుంచి పారిపోయింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం పోలీసులు డేనియల్ కుటుంబాన్ని పట్టుకుని అరెస్ట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story