నా హృదయానికి చేరువైన చిత్రం : అనుష్క

నా హృదయానికి చేరువైన చిత్రం : అనుష్క
ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం నా అదృష్టం అని ఒక అభిమాని వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పారు అనుష్క.

టాలీవుడ్‌లో అగ్రశ్రేణి తారగా వెలుగొంది అంతలోనే స్క్రీన్‌కి దూరమైన అందాల తార అనుష్క నిశ్శబ్ధం చిత్రంతో అభిమానులకు మళ్లీ కనువిందు చేసింది. సోషల్ మీడియాకు దూరంగా ఉండే అనుష్క ఫ్యాన్స్‌కు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ట్విట్టర్ వేదికగా సినిమా సంగతులతో పాటు, వ్యక్తిగత విషయాలూ పంచుకుంది.నటిగా నా పరిధి దాటి ఆలోచించేలా చేసిన పాత్ర ఇది. ఎంతో నేర్చుకున్నా. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం నా అదృష్టం అని ఒక అభిమాని వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పారు అనుష్క.

ఇక ఇష్టమైన పాత్రల గురించి చెబుతూ అరుంధతి, వేదం, రుద్రమదేవి, భాగమతి, సైజ్ జీరో, నిశ్శబ్దం, బాహుబలి, నాన్న సినిమాల్లోని పాత్రలంటే ఇష్టం. మంచి కథ వస్తే ప్రభాస్‌తో కలిసి నటించడానికి సిద్ధమేనని చెప్పారు. ఓ అభిమాని మిర్చి చిత్రంలో అనుష్క, ప్రభాస్ పెళ్లి సీన్‌లో ఉన్నప్పటి ఫోటోను షేర్ చేస్తూ ఆ ఫోటో గురించి ఒక్క మాట చెప్పండి అంటే.. సన్నివేశం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో తీసిన ఫోటో అది. ఆపై అది అందమైన పోస్టర్‌గా మారింది. నా హృదయానికి చేరువైన చిత్రమిది. యూవీ క్రియేషన్స్‌లో చేసిన తొలి సినిమా అది అని ఆమె అన్నారు.

Tags

Next Story