వావ్ అనుష్క.. ఒకేసారి మూడు భాషల్లో..

వావ్ అనుష్క.. ఒకేసారి మూడు భాషల్లో..
ఇప్పటి వరకు ఏ హీరో చిత్రం ఇలా మూడు భాషల్లో ఒకేసారి విడుదల కాలేదు.

తెలుగు ప్రేక్షకులు అందాల తార అనుష్క సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు తను నటించిన నిశ్భబ్ధం థియేటర్లో చూసే అదృష్టానికి నోచుకోలేకపోయినా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజవుతోంది. అనుష్క ఈ సినిమాతో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకోబోతోంది. ఒకేసారి మూడు భాషల్లో తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో అక్టోబర్ 2 నుంచి ఈ చిత్రం ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై విడుదల చేస్తోంది చిత్ర యూనిట్. ఇప్పటి వరకు ఏ హీరో చిత్రం ఇలా మూడు భాషల్లో ఒకేసారి విడుదల కాలేదు. ఈ అరుదైన రికార్డును స్వీటీ మాత్రమే సొంతం చేసుకుంటోంది.

కాగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్‌కు కూడా మంచి స్పందన రావడం శుభసూచికంగా భావిస్తున్నారు యూనిట్ సభ్యులు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రాన్ని క్రితి ప్రసాద్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పోరేషన్ అసోసియేషన్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కోనవెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వినికిడి లోపంతో పాటు, మాటలు రాని అమ్మాయి పాత్రలో అనుష్క నటించారు. అనుష్క, అంజలీ, మాధవన్, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ ప్రధాన తారగాణంగా నటించిన ఈ చిత్రం ఓ సస్పెన్స్ థ్రిల్లర్.

Tags

Read MoreRead Less
Next Story