కళ్లు తిరిగి పడిపోయిన భక్తురాలికి కానిస్టేబులే వాహనమై..

కళ్లు తిరిగి పడిపోయిన భక్తురాలికి కానిస్టేబులే వాహనమై..
X
అన్నమయ్య కాలిబాట మార్గాన పాదయాత్ర సాగుతోంది.

తిరుమల శ్రీవారిని దర్శించుకుందామని కాలి నడకన వెళుతున్న భక్తురాలు కళ్లు తిరిగి పడిపోవడంతో ఓ కానిస్టేబుల్ ఆమెను ఆరుకిలో మీటర్లు భుజాన మోసుకుని వెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. ఆ సమయంలో ఆమె పాలిట దేవుడయ్యాడు. కానిస్టేబుల్ చేసిన మంచి పనికి కొండ మీద ఉన్న దేవుడు కూడా సంతోషించే ఉంటాడు. వైఎస్సార్‌సీపీ రాజంపేట జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి ఇటీవల చేపట్టిన తిరుమల పాదయాత్ర విధుల్లో స్పెషల్ పార్టీ పోలీస్ షేక్ అర్షద్ పాల్గొన్నారు.

అదే సమయానికి 58 ఏళ్ల మంగి నాగేశ్వరమ్మ కూడా శ్రీవారిని దర్శించుకునేందుకు వెళుతోంది. మంగళవారం అన్నమయ్య కాలిబాట మార్గాన పాదయాత్ర సాగుతోంది. అయితే నాగేశ్వరమ్మ కొండ ఎక్కలేక కొంత దూరం వెళ్లి గుర్రపు పాదం సమీపంలో సొమ్మసిల్లి పడిపోయింది. నాగేశ్వరమ్మకు సంబంధించిన కుటుంబసభ్యులు ఇద్దరు ఆమె పక్కన ఉన్నా వాళ్లు ఆమెను మోసుకెళ్లలేని పరిస్థితి. ఆ సమయంలో ముందు వెళుతున్న కానిస్టేబుల్ అర్షద్‌కు ఈ విషయం తెలిసి వెనక్కు వచ్చారు. ఆమెను వీపుపై ఎక్కించుకుని ఆరు కి.మీ దూరంలో ఉన్న రోడ్డు మార్గం వరకు మోసుకెల్లారు. అక్కడ ఓ ప్రత్యేక వాహనంలో ఆమెను తిరుమలలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.

Tags

Next Story