Aparna Balamurali: విద్యార్థిపై వేటు...

Aparna Balamurali: విద్యార్థిపై వేటు...
నటి అపర్ణా బాలమురళిని ఇబ్బందికి గురి చేసిన విద్యార్ధి; సస్పెండ్ చేసిన కళాశాల యాజమాన్యం...

జాతీయ పురస్కార గ్రహీత, నటి అపర్ణా బాలమురళితో తప్పుగా ప్రవర్తించిన విద్యార్ధిని సస్పెండ్ చేస్తున్నట్లు కళాశాల యాజమాన్యం ప్రకటించింది. ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.


గురువారం ఓ సినిమా ప్రచారం నిమిత్తం కేరళలోని లా కాలేజీకి వెళ్లిన చిత్ర బృందం సరదాగా విద్యార్ధులతో కలసి ఆడిపాడింది. అక్కడివరకూ బాగానే ఉండగా, చిత్ర బృందం స్టేజ్ పై కూర్చిని ఉండగా.. ఓ ఔత్సాహిక విద్యార్ధి ఉన్నట్లుండి స్టేజ్ పైకి ఎక్కి అపర్ణకు షేక్ హ్యాండ్ ఇచ్చినట్లే ఇచ్చి ఆమెను బలవంతంగా లేపి నిల్చేబెట్టాడు. తనతో ఫొటో దిగాల్సిందిగా కోరుతూ ఆమె భుజంపై చేయి వేయబోయాడు.


ఈ హఠాత్పరిమాణానికి షాక్ అయిన అపర్ణ వెంటనే అతడి నుంచి పక్కకు తప్పుకుంది. అనంతరం సదరు విద్యార్ధి క్షమాపణలు చెప్పినప్పటికీ అపర్ణ ముఖంలో వివర్ణమైంది.


ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో కళాశాల యాజమాన్యం స్పందించింది. తమ కళాశాల తరఫున అపర్ణకు క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. అపర్ణ పట్ల తప్పుగా ప్రవర్తించిన విద్యార్ధిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.



Tags

Read MoreRead Less
Next Story