వినియోగదారులకు యాపిల్ షాక్..

వినియోగదారులకు యాపిల్ షాక్..
ఈ సంవత్సరం ఆగస్టులో ప్లే స్టోర్ నుంచి ఆఫ్ లైన్‌కు గూగుల్ పే వెళ్లింది.

వినియోగదారులు నగదు చెల్లింపులు చేయడంలో ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతున్నందున ఈ యాప్‌ను తాత్కాలికంగా యాప్ స్టోర్ నుంచి యాపిల్ తొలగించింది. గూగుల్ పే కోసం సెర్చ్ చేసిన వారికి ఆ యాప్ కాకుండా దానికి ప్రత్యామ్నాయంగా ఫోన్ పే, పేటీయం, భీమ్ యూపీఐ వంటి యాప్స్ ప్రస్తుతం కనబడుతున్నాయి. యాప్ స్టోర్ నుంచి గూగుల్ కనబడకుండా పోవడం ఇదే మొదటి సారి. ఈ సంవత్సరం ఆగస్టులో ప్లే స్టోర్ నుంచి ఆఫ్ లైన్‌కు గూగుల్ పే వెళ్లింది.

ఈ విషయంపై స్పందించిన గూగుల్ ప్రతినిధి ఒకరు దీన్ని సరిచేయడానికి తమ బృందాలు పనిచేస్తున్నాయని అన్నారు. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపారు. అయితే ఆండ్రాయిడ్ వినియోగదారులకు ప్రస్తుతం ఎలాంటి అసౌకర్యం లేదు. ఈ యాప్ ఇప్పటికే ఇన్ స్టాల్ అయి ఉన్న ఐఫోన్లలో పని చేస్తూనే ఉంది. దాన్ని యాపిల్ అన్ ఇన్ స్టాల్ చేయలేదు. కానీ ప్రస్తుతం దాన్నుంచి అక్కడ లావాదేవీలు జరగట్లేదు. సమస్య పరిష్కారమయ్యేంత వరకు వేరే యాప్స్ వాడుకోవడమే.

Tags

Next Story