ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్
X
ఈ ఫ్రీ పాస్‌లు 25 కిలోమీటర్ల లోపు ప్రయాణానికి ఉపయోగించుకోవచ్చన్నారు.

ఆర్టీసీలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. సుమారు 5 వేల మంది సిబ్బందికి జనవరి 1 నుంచి ఉచిత బస్ పాసులను జారీ చేయనున్నట్లు ఎండీ కృష్ణబాబు తెలిపారు. ఈ ఫ్రీ పాస్‌లు 25 కిలోమీటర్ల లోపు ప్రయాణానికి ఉపయోగించుకోవచ్చన్నారు. వీటి ద్వారా ఉద్యోగి ఇంటి నుంచి కార్యాలయం వరకు ఉచితంగా ప్రయాణించవచ్చునని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపో మేనేజర్లు, యూనిట్ ఆఫీసర్ల ద్వారా ఔట్ సోర్సింగ్ సిబ్బందికి పాసులు జారీ చేస్తామని కృష్ణబాబు తెలిపారు. ఈ పాసులు సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, పల్లె వెలుగు బస్సుల్లో చెల్లుతాయన్నారు. సిబ్బందికి ఆర్ధిక వెసులుబాటు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయవద్దని ఆయన సిబ్బందికి సూచించారు.

Tags

Next Story