హాట్సాఫ్ : గర్భవతిని భుజాలపై ఆస్పత్రికి చేర్చిన భారత జవాన్లు!

హాట్సాఫ్ : గర్భవతిని భుజాలపై  ఆస్పత్రికి చేర్చిన భారత జవాన్లు!
శత్రుమూకల నుంచి దేశాన్ని రక్షించడంతోపాటు, సరిహద్దుల్లోని ప్రజలకు ఎలాంటి అవసరమైనా ఇండియన్‌ ఆర్మీ ముందుంటోంది అనేందుకు సాక్ష్యంగా నిలిచింది

Indian Army : శత్రుమూకల నుంచి దేశాన్ని రక్షించడంతోపాటు, సరిహద్దుల్లోని ప్రజలకు ఎలాంటి అవసరమైనా ఇండియన్‌ ఆర్మీ(Indian Army) ముందుంటోంది అనేందుకు సాక్ష్యంగా నిలిచింది జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఈ ఘటన. వివరాల్లోకి వెళ్తే.. కుప్వారా(Kupawara)లోని ఫకియాన్‌ గ్రామానికి చెందిన మంజూర్‌ అహ్మద్‌ షేక్‌(Manzoor Ahmed Sheikh) భార్య గర్భవతి(pregnant woman )గా ఉంది. ఈ నెల 5న ఆమెకి నొప్పులు ఎక్కువయ్యాయి. రెండు కీమీ దాటుతే కానీ ఆసుపత్రి లేదు. ఆ సమయానికి వెళ్ళడానికి వాహనాలు కూడా లేవు.. మరోపక్కా గడ్డకట్టే చలి, మోకాళ్లలోతు మంచు.. ఇలాంటి టైంలో హృదయ విదారకంగా విలపిస్తూ జవాన్ల సహాయం అడిగాడు మంజూర్‌.

దీనితో వెంటనే స్పందించిన నలుగురు సైనికులు మంజూర్‌ భార్యను తమ భుజాలపైన సుమారుగా మూడు కీమీ మోస్తూ కరాల్‌పురాలో ఉన్న ఆస్పత్రికి చేర్చారు. దీనికి సంబంధించిన వీడియోను భారత రక్షణ మంత్రిత్వ శాఖ( Ministry of Defence) సోషల్‌ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సరిలేరు మీకెవ్వరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఆసుపత్రికి చేరిన సదరు మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.


Tags

Next Story