కూలిన డిఫెన్స్ హెలికాప్టర్‌.. అందులో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు..

కూలిన డిఫెన్స్ హెలికాప్టర్‌.. అందులో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు..
తమిళనాడులోని కూనూరులో ఆర్మీ హెలికాప్టర్‌ కుప్ప కూలింది. ఐతే.. ఈ హెలికాప్టర్‌లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్ స్టాఫ్‌ బిపిన్ రావత్ ఉన్నట్లు తెలుస్తోంది.

తమిళనాడులోని కూనూరులో ఆర్మీ హెలికాప్టర్‌ కుప్ప కూలింది. ఐతే.. ఈ హెలికాప్టర్‌లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్ స్టాఫ్‌ బిపిన్ రావత్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెల్లింగ్టన్ బేస్‌ ఆస్పత్రికి తరలించారు.

తమిళనాడులోని కూనూరులో ఘోర ప్రమాదం జరిగింది. మిలటరీ హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటనలో నలుగురు ఉన్నతాధికారులు మృత్యువాతపడ్డారు. ఇందులో ఇద్దర్ని గుర్తించారు. ఇదే హెలికాఫ్టర్‌లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్ స్టాఫ్‌ బిపిన్ రావత్ కూడా ప్రయాణం చేస్తున్నారు. ఆయనతోపాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వారు, మిగతా అధికారులు ఏమయ్యారు, వాళ్ల క్షేమ సమాచారం ఏంటనే దానిపై తీవ్ర ఆందోళన నెలకొంది.

ప్రమాద విషయం తెలియగానే యమర్జెన్సీ రెస్క్యూటీమ్‌లను రంగంలోకి దించారు. ఇప్పటికి నలుగురు చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. నీలగిరి జిల్లా కలెక్టర్‌తోపాటు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు కూడా నిర్థారించారు. MI హెలికాఫ్టర్‌ 17 V 5 కూలిన ఘటన దేశవ్యాప్తంగా అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. మరికాసేపట్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ దీనిపై ప్రకటన చేయనున్నారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ యమర్జెన్సీ సమావేశం జరుగుతోంది.

CDS బిపిన్ రావత్‌తోపాటు ఆయన భార్య, అధికారులు కలిపి ప్రమాద సమయంలో హెలికాఫ్టర్‌లో 9 మంది ఉన్నారు. సూలూర్‌ ఎయిర్‌బేస్‌ నుంచి వెల్లింగ్టన్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ కాలేజీకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోయంబత్తూరు-కూనూరు మధ్యలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో గాయపడ్డ ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. మిగతా వారు ముందే ప్యారాచూట్‌ నుంచి దూకి బయటపడ్డారా, లేదంటే లోయలో జారిపడిపోయారా అనే దానిపై క్లారిటీ లేదు.

ప్రస్తుతం స్థానికులు కూడా పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. మిలటరీ హెలికాఫ్టర్ కూలిన ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. అటు, ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా, కుట్రకోణం ఏదైనా ఉందా అనేది తేల్చేందుకు వెంటనే విచారణకు ఆదేశించినట్టు IAF ఉన్నతాధికారులు చెప్తున్నారు.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్.. అంటే త్రివిదదళాలకు అధిపతి హోదా. ఆర్మీ చీఫ్‌గా రావత్ రిటైర్ అయిన తర్వాత ఈ కొత్త పోస్ట్‌ను సృష్టించి మరీ ఆయనకు CDS బాధ్యతలు అప్పగించారు. అలాంటి శక్తివంతమైన పదవిలో ఉన్న బిపిన్‌ రావత్ ఇలా హెలికాఫ్టర్ ప్రమాదంలో చిక్కుకోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అత్యంత కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థ ఉండే హెలికాఫ్టర్ ప్రమాదానికి గురవడానికి కారణాలేంటి.. అసలేం జరిగింది అనేది ఇప్పటికైతే మిస్టరీగానే ఉంది.

ఈ ప్రమాదానికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణమా, హెలికాఫ్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందా, మరేదైనా కుట్రకోణం దాగి ఉందా అనేది ఇప్పుడు అంతుపట్టడం లేదు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. బిపిన్ రావత్‌ కుటుంబం గల్లంతవడంతో వారి కోసం ప్రమాదం జరిగిన చుట్టుపక్కల అణువణువూ గాలిస్తున్నారు.

హెలికాప్టర్ లో ఉన్నవారు.

బిపిన్‌ రావత్‌

మధులిక రావత్‌

ఎల్‌ఎస్‌ లిడ్డర్‌

లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ హరిందర్‌సింగ్‌

ఎన్‌కే గురుసేవక్‌సింగ్‌

ఎన్‌కే జితేందర్‌కుమార్‌

లాన్స్‌నాయక్‌ వివేక్‌ కుమార్‌

లాన్స్‌నాయక్‌ బి.సాయితేజ

సత్‌పాల్‌

ఉన్నట్లు ఆర్మీ ధృవీకరించారు

Tags

Read MoreRead Less
Next Story